YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 కరోనా పరీక్షల్లో కేసీఆర్ ప్రభుత్వం విఫలం

 కరోనా పరీక్షల్లో కేసీఆర్ ప్రభుత్వం విఫలం

 కరోనా పరీక్షల్లో కేసీఆర్ ప్రభుత్వం విఫలం
జర్నలిస్టులకు 50లక్షల ఇన్సూరెన్స్ ప్రకటించాలి
ఆదిలాబాద్ జూన్ 09 
రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తున్నా చేతకాని అసమర్థ ప్రభుత్వం కారోనా, టెస్టులు చేయకుండా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని బిజెపి జిల్లా అధ్యక్షుడు పా యల శంకర్ విమర్శించారు. ఆదిలాబాద్ లోని  బిజెపి పార్టీ కార్యాలయంలో కరోనా కాటుకు గురై మృతి చెందిన టీవీ 5 జర్నలిస్టు మనోజ్ కుమార్ యాదవ్ కు సంతాపం ప్రకటించారు.. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం బిజెపి జిల్లా అధ్యక్షుడు జయశంకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వాకం వల్ల సరైన వైద్యం అందక పోలీసులు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారని వైద్య సేవల విషయంలో ప్రభుత్వానికి ఏ మాత్రం చీమ కుట్టినట్టైనా లేదని విమర్శించారు.. పక్క రాష్ట్రంలో మూడు లక్షల పైచిలుకు కరోనా టెస్ట్లు నిర్వహిస్తే తెలంగాణలో ముప్పై ఐదు వేలు మాత్రమే పరీక్షలు నిర్వహించారని పాయల శంకర్ ధ్వజ మెత్తారు. జర్నలిస్టు మనోజ్ కుమార్ కు గాంధీ ఆస్పత్రిలో సరైన వైద్యం అందక నే మృతిచెందాడని ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.. జర్నలిస్టు మనోజ్ కుమార్ యాదవ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన పాయల్ శంకర్ ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులందరికీ 50 లక్షల ఇన్సూరెన్స్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులందరికీ పి పి ఐ కిట్లు అందించాలని ... మనోజ్ కుమార్ కుటుంబానికి 30 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలని పాయల్ శంకర్ డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నాంపల్లి వేణుగోపాల్ పట్టణ అధ్యక్షులు ఆకుల ప్రవీణ్. వేణుగోపల్   జోగు రవి మున్నా.సోమరవి.దినేష్ మటోలియ.శ్రీనివాస్. కృష్ణా.శ్రీనివాస్  భూమన్న  రాజేష్ తదితరులు  పాల్గొన్నారు

Related Posts