YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

 మచిలీపట్నంలో నాలుగు ప్రాంతాలలో చేపల మార్కెట్లు     

 మచిలీపట్నంలో నాలుగు ప్రాంతాలలో చేపల మార్కెట్లు     

 మచిలీపట్నంలో నాలుగు ప్రాంతాలలో చేపల మార్కెట్లు                              
మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం
పట్టణంలో నడిబొడ్డున ఉన్న ఏకైక చేపల మార్కెట్లో గుంపులు గుంపులుగా అటు వ్యాపారులు, ఇటు కొనుగోలు దారులు ఎగబడడంతో విపరీతంగా రద్దీ పెరిగిందని, ప్రజారోగ్యం దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత చేపల మార్కెట్ కు బదులుగా టౌన్ నాలుగు వైపుల చేపల మార్కెట్లను విస్తరించనున్నట్లు రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ప్రకటించారు. మంగళవారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోసం పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో మంత్రి పేర్ని నాని మాట్లాడి వారి ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకొన్నారు. స్థానిక మత్స్య మార్కెట్ కు చెందిన పలువురు మహిళలు మంత్రి పేర్ని నానిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. మచిలీపట్నం ప్రధాన చేపల మార్కెట్ పై దాదాపు 170 మంది ఆధారపడ్డామని టౌన్ లో నాలుగు వైపుల చేపల మార్కెట్లు పెడితే, తమ వ్యాపారం సన్నగిల్లిపోతుందని వాపోయారు. తర తరాలుగా పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రధాన చేపల మార్కెట్ లో జీవనం కొనసాగిస్తున్నామని, అందరం ఇక్కడే కలిసి మెలిసి ఉంటున్నామని ఇపుడు తలో దిక్కుకు వెళ్ళీ చేపల వ్యాపారం చేయడం ఎంతో కష్టమని, వినియోగ దారులు చేపలు కొనేందుకు రావడం ఎంతో ఇబ్బంది అని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ , రెండు లక్షల జనాభాలో మాంసాహార ప్రియులు అధికమయ్యారని పేర్కొంటూ, తొలుత కరోనా వైరస్..చైనా చేపల మార్కెట్లో మొదలై ప్రపంచం మొత్తం పాకిందనే విషయం ఏ ఒక్కరు మరువ రాదన్నారు. సెంట్రల్‌ చైనాలోని వూహాన్‌ నగరంలో ఈ వైరస్‌ తొలుత నగరంలోని చేపల మార్కెట్‌లో ప్రబలిందని తెలిపారు. జనవరి నెల 3న మొదటి కేసు నమోదైందని ఆసుపత్రిలో చేరిన బాధితులంతా ఆ చేపల మార్కెట్‌కు చెందిన వ్యాపారులు, కొనుగోలుదారులేనని పేర్కొన్నారు. ఊరంతా ఒకే చోట చేపలను కొనుగోలు చేయడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. అలాగే 170 మందికి గుర్తింపు కార్డులు ఇచ్చి.. నాలుగు మార్కెట్ లో రొటేషన్ పద్ధతి అమలుచేస్తామని తమకు వ్యాపారం తగ్గిపోతుందనే అపోహ వీడాలని మంత్రి ఆ మహిళలకు తెలిపారు.తాము 2003 డి ఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులమని పాత పెన్షన్ స్కీమ్ ( సి పి ఎస్ ) విధానంలో ఉన్నామని, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తమకు పెన్షన్ ఇవ్వవచ్చని కమిషనరేట్ స్కూల్ ఎడ్యుకేషన్ అన్ని జిల్లాల డి ఇ ఓ లకు 2003 డి ఎస్సి ఉపాధ్యాయుల వివరాలు తెలియచేయమని సమాచారం అడిగిందని ఆ విషయాన్ని జరగనున్న అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళమని మంత్రి పేర్నినానిని 2003 డి ఎస్సి ఫోరమ్ అభ్యర్ధించింది.బందరు మండలం గోపువానిపాలెంకు చెందిన తోట వెంకట రమేష్ మంత్రి పేర్ని నానిని కలిసి తన ఇబ్బంది చెప్పుకొన్నారు, తాను దివ్యా0గుడినని పి హెచ్ కోటాలో గతంలో గుడివాడ రైతుబజారులో కాయగూరల దుకాణం ఉండేదని , ప్రస్తుతం దరఖాస్తు చేసుకొంటే మంత్రి గారిచే సంతకం పెట్టించుకురమ్మని అధికారులు చెబుతున్నారని మంత్రి పేర్ని నానికి తెలిపారు.జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార సంఘం ఎస్ సి కార్పొరేషన్ లో రోజువారీ కూలీలుగా , ఎన్ ఎం ఆర్ ఉద్యోగులుగా రెగ్యులర్ స్టాఫింగ్ పాట్రన్ గత 13 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నామని తమ విజ్ఞప్తులను పరిగణనలో తీసుకోని కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీస్ లను ఏవిధంగా క్రమబద్దీకరిస్తారో అదేవిధంగా తమ సర్వీస్ లను క్రమబద్దీకరించాలని మంత్రి పేర్ని నానిని పి శ్రీనివాస్ , పి బి వి వి డి ప్రసాద్ , వి సురేష్ , అఫ్జల్ షా , ఎం నానిబాబు , పి సీత లు అభ్యర్ధించారు.తాము (సెర్ఫ్) వైస్సార్ క్రాంతిపథంలో 2000 సంవత్సరంలో వెలుగు పథకంగా వున్నప్పటినుండి పనిచేస్తున్నామని , రెగ్యులైజేషన్ లో తమ డాటాను కూడా తీసుకోవాలని కోరుతూ మంత్రి పేర్ని నానిని కొలగాని లక్ష్మీ , వీరంకి సుధ, మైనంపూడి మాధవి కలిసి తమ అభ్యర్థన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4000 మంది పనిచేస్తున్నామని అందులో మండల సమైక్య క్లస్టర్ కో ఆర్డినేటర్ లు 1132 మంది ఉన్నామని, తాము జిల్లా సమైక్య కంట్రోల్ లో ఉన్నామని తెలిపారు. దీనికి స్పందించిన మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ , రెగ్యులైజేషన్ కస్టమని , వేతనాల పెంపు విషయం తప్పక పరిశీలిస్తమని తెలిపారు గతంలో తాపీపనిలో కూలీగా పనిచేసెనని 25 ఏళ్ళ వయస్సులో పక్షవాతం సోకిందని తనకు జీవనాధారం ఎంతో కష్టంగా మారిందని మచిలీపట్నం ముస్తఖాన్ పేటకు చెందిన మల్లెల నరసయ్య మూడుచక్రాల బండిలో వచ్చి మంత్రి పేర్ని నానిను వేడుకొన్నారు. నరసయ్య దుస్థితి చూసి జాలిపడిన మంత్రి మాట్లాడుతూ , నీకు ప్రభుత్వ పింఛన్ మంజూరు ఆయ్యేలోపున ప్రతి నెల తన కార్యాలయం వద్దకు వచ్చి కొంత మొత్తం నగదు తీసుకెళ్లమని తెలిపారు.

Related Posts