YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 మురుగు నీటిలో కోవిడ్

 మురుగు నీటిలో కోవిడ్

 మురుగు నీటిలో కోవిడ్
గాంధీనగర్, జూన్ 10
భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోన్న వేళ ఐఐటీ గాంధీనగర్ పరిశోధకులు ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. మన దేశంలోని మురుగు కాల్వల్లో కోవిడ్ ఆనవాళ్లను గుర్తించారు. అహ్మదాబాద్‌లో శుద్ధి చేయని మురుగు నీటి శాంపిళ్లను సేకరించగా.. కరోనా జన్యువులు ఉన్నట్లు ఐఐటీ గాంధీ నగర్ పరిశోధకులు గుర్తించారు. కోవిడ్ కట్టడి కోసం వృథా జలాలపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని ఈ పరిశోధనను బట్టి అర్థం అవుతోంది.కోవిడ్ బారిన పడిన లక్షణాలు ఉన్న వారిలో మాత్రమే కాకుండా లేని వారి శరీరంలోనూ వైరస్ ఉంటుందనే సంగతి తెలిసిందే. విసర్జన ద్వారా అవి శరీరం నుంచి మురుగునీటి క్వాల్లోకి చేరతాయి. దీంతో వృథా జలాల్లో కరోనా ఆనవాళ్లు కనిపిస్తే ఆ ప్రాంతంలో కరోనా కేసులు బయటపడనప్పటికీ... ఇన్ఫెక్షన్ బారిన పడిన వారు ఉన్నట్లు గుర్తించొచ్చని ఐఐటీ గాంధీనగర్ ప్రొఫెసర్ మనీష్ కుమార్ తెలిపారు.ఇప్పటి వరకూ ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, అమెరికాల్లో మురుగు నీటిలో కోవిడ్ ఆనవాళ్లను గుర్తించారు. మురుగు నీటిలో కరోనా ఆనవాళ్ల విషయమై 51 యూనివర్సిటీల గ్లోబల్ కన్సార్టియంలో ఐఐటీ గుజరాత్ కూడా చేరింది.మురుగు నీటిలోని వైరస్ మరొకరికి సంక్రమించదని పరిశోధనల్లో తేలింది. అంతేకాదు నటిలో వైరస్ మనుగడ సాగించడంపై ఉష్ణోగ్రత లాంటి పర్యావరణ అంశాలు ప్రభావితం చేస్తాయి. మురుగునీటిలో వైరస్ ఆనవాళ్లను గుర్తించడం ద్వారా ఓ ప్రాంతంలో కోవిడ్ ఉందా లేదా అనే విషయమై ప్రాథమికంగా అవగాహనకు రావచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కానీ మన దేశంలో ఇదంత తేలికేమీ కాదని కొందరు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
 

Related Posts