YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రశాంత్ రెడ్డిపై అర్వింద్ విమర్శలు

ప్రశాంత్ రెడ్డిపై అర్వింద్ విమర్శలు

ప్రశాంత్ రెడ్డిపై అర్వింద్ విమర్శలు
నిజామాబాద్, జూన్ 9,నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి తనదైన శైలిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆరోపణలు చేశారు. తెలంగాణకు విధిగా దక్కాల్సిన కృష్ణా జలాలను ఏపీ సీఎం జగన్‌కు కేసీఆర్ అమ్మేశారని ఆరోపించారు. నియంత్రిత వ్యవసాయ సాగు విధానం అంటూ.. రైతులపై ఆంక్షలు విధిస్తున్నారని ధ్వజమెత్తారు. చెప్పిన పంటలు వేస్తేనే రైతు బంధు పథకం వర్తింపుజేస్తామనడం వారిని అన్యాయానికి గురి చేయడమే అని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ప్రకటించిన కేసీఆర్ మాటల వల్ల మొక్కజొన్న రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారని గుర్తు చేశారు. అన్ని రంగాల్లో అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ ఇప్పుడు వ్యవసాయ రంగంలో కూడా అవినీతి మొదలు పెట్టారని విమర్శించారు.బీజేపీతో పెట్టుకుంటే టీఆర్‌ఎస్ తుడిచిపెట్టుకుపోతుందని అర్వింద్ అన్నారు. అభివృద్ధి విషయంలో మంత్రి ప్రశాంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఒక మంత్రిగా నిజామాబాద్ జిల్లాకు ఆయన చేసిందేమీ లేదని ఆరోపించారు. ఎంఐఎం అధినేత ఒవైసీ గురించి ప్రస్తావిస్తూ.. ఆయన ఓ దేశ ద్రోహి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం పార్టీ చట్ట వ్యతిరేక, దేశ ద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపించారు. వలస కార్మికుల విషయంలో కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో మోదీ లాంటి వ్యక్తి ప్రధానిగా ఉండటం తమ అదృష్టమని ధర్మపురి అర్వింద్ కొనియాడారు.

Related Posts