YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ కు మోడీ ఆశీస్సులు ఉన్నాయి

జగన్ కు మోడీ ఆశీస్సులు ఉన్నాయి

జగన్ కు మోడీ ఆశీస్సులు ఉన్నాయి
కర్నూలు, జూన్ 9,
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ బ్లెస్సింగ్స్‌తోనేనని ఆ పార్టీ ఎంపీ టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మూడు ప్రాంతీయ, మూడు జాతీయ పార్టీలున్నాయని, అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్, వామపక్షాలు మనుగడ కోల్పోయాయని వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు పార్టీ బీజేపీ మద్దతుతో గెలిస్తే.. ఆ తర్వాత జగన్ పార్టీ కూడా బీజేపీ బ్లెస్సింగ్స్‌తోనే గెలిచిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మరో ప్రాంతీయ పార్టీ జనసేన బీజేపీతో ఉందన్నారు.రాష్ట్రంలో రాజ్యాధికారం చేపట్టబోయేది బీజేపీనేనని ఎంపీ టీజీ వెంకటేష్ జోస్యం చెప్పారు. ఏపీలో సంక్షేమ పథకాలు తాత్కాలికంగా కాకుండా శాశ్వత ప్రయోజనంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఆటో డ్రైవర్లకు డబ్బులివ్వడం కంటే.. ఎలక్ట్రిక్ ఆటోలు ఇస్తే మంచిదని.. దీని వల్ల పర్యావరణానికి కూడా మేలు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో దళితుల సమస్యలు పెరిగాయన్నారు.అలాగే సీఎం జగన్ గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తీసుకొస్తున్నారని ఎంపీ టీజీ వెంకటేష్ విమర్శించారు. ఇసుక అనేది సమస్యే కాదని.. కానీ, దాన్ని జటిలం చేశారని విమర్శించారు. కేంద్రం ఇచ్చే రూ. వేల కోట్ల నిధులు అభివృద్ధికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు. కేంద్రం ఇచ్చే నిధులను జగన్ మేనిఫెస్టోలోని పథకాలకు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో అమలయ్యే అన్ని పథకాల్లో కేంద్రం నిధులున్నాయని తెలిపారు. ఏపీలో పోలవరం మినహా.. మిగతా శాశ్వత ప్రయోజనాలు కల్పించే ప్రాజెక్టులు ఏవీ లేవని వ్యాఖ్యానించారు. ఇలాగైతే కేంద్రంలో రాష్ట్రం ప్రభుత్వంపై నమ్మకం పోతుందని టీజీ అభిప్రాయపడ్డారు.
 

Related Posts