YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ చేయాలి

రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ చేయాలి

రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ చేయాలి
నియంత్రిత సాగు పేరుతో  నిర్బంద వ్యవసాయ విధానం 
పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 
జగిత్యాల జూన్ 09 
తెల్ల రేషన్ కార్డు దారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేయాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పట్టభద్రుల  ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు తీపికబురు చెబుతామంటున్నా కేసిఆర్  రైతులకు, వినియోగదారులకు లాభంచేకూర్చెవిధంగా సన్నరకం వరిధాన్యాన్ని భారత ఆహార సంస్థ సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వమే రూ. 2500లకు కొనుగోలు చేసి మిల్లింగ్ చేసిన సన్నబియ్యాన్ని దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తే  రైతులకు, వినియోగదారులకు,సామాన్యునికి మేలుచేసిన వారవుతారని , విధానాన్ని అమలుచేస్తే బాధ్యత గల పౌరుడిగా కేసిఆర్ కు పాలాభిషేకం చేస్తానని,ఈ విధానం అమలు అయ్యే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి కేసిఆర్ కు సూచించారు. రేషన్ షాపుల ద్వారా ఇపుడిస్తున్న దొడ్డు రకం బియ్యం పక్కదారి పడుతుందని, సన్నబియ్యం పంపిణీ వల్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. తెల్ల రేషన్ కార్డుదారులకు  సన్నబియ్యం అందించాలని దాంతో పాటు 9 రకాలనిత్యావసర వస్తువులను పేదలకు అందించాలన్నదే  నా చిరకాల స్వప్నమని  పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ కు పాలాభిషేకం చేస్తానని చెప్పారు. నియంత్రిత పంటలసాగు పేరుతో నిర్బంధం వ్యవసాయ విధానాన్ని కేసిఆర్ తెరపైకి తెస్తున్నారని, పంటలసాగు విషయంలో  రైతులకు సూచనలు చేయాల్సిన ప్రభుత్వం నిర్బంధంగా వ్యవసాయం చేయించాలనుకోవడం దేశంలో ఎక్కడా లేదని ఎమ్మెల్సీ ఎద్దేవా చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు రాయితీలతో పాటు మద్దతు ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని కోరారు.   రైతులు లాభసాటి వ్యవసాయం చేస్తారని,  మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు సాగు చేస్తారని ,ఆటంకాలను ప్రభుత్వం ప్రోత్సహించి రాయితీలతో పాటు పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మునుపటి కంటే  ఈఏడాది రైతులు సాగుచేసే విత్తనాల రాయితీని మెరుగుపరచాలన్నారు.  సన్నరకం వరి పంటను సాగు చేయాలని చెబుతున్న ప్రభుత్వం రూ.2500 మద్దతు ధరకు  కొనుగోలు చేయాలని, అలాగే  కంది, పెసర, మినుము, పప్పుధాన్యాలకు విత్తనరాయితి మెరుగుపరిచి  మద్దతుదారు కలిపి ప్రోత్సాహాన్ని అందిస్తే రైతులు సన్నీ రకం వరి సాగుకు ముందుకు వస్తారని ఆన్నారు.పత్తి పంట సాగు చేయాలని చెబుతున్న ప్రభుత్వం ప్రైవేటు విత్తన కంపెనీలకు వదిలేసిందని ఆరోపించారు. పండ్ల, కూరగాయల సాగుపై  ప్రభుత్వం దృష్టి సారించాలని మెట్ట ప్రాంతాల్లో  సూక్ష్మ బిందు సేద్యాన్ని ప్రోత్సహించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుని పండ్ల తోటలు పెంపకానికి గత రెండు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం రూ.230 కోట్ల నిధులు సమకూరిస్తే లక్ష్యాన్నిచేరుకోకపోగా  ఆనిధులను  వినియోగించకపోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు..ఉద్యానవన శాఖలో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ 430 మంది ఉద్యోగులను తొలగించడంతో  రైతులకు సలహాలిచ్చే వారు లేక పండ్ల తోటలు, సూక్ష్మ బిందు సేద్యం తగ్గిందని, తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని  డిమాండ్ చేశారు. ఈ సీజన్లో వరి ధాన్యం కొనుగోలు లో నిర్లక్ష్యంవల్ల ప్రభుత్వం రైతులను రోడ్డున పడేసింది, ఐదు నుంచి పది శాతం తరుగుతో ధాన్యం కొనుగోలు చేసి ప్రభుత్వం రైతులను నిలువు దోపిడి చేసిందని విమర్శించారు.2007లో అప్పటి ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఐకేపీ, ఫ్యాక్స్ కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్ల నుంచి రైతులకు విముక్తి కలిగిస్తే కేసిఆర్ ప్రభుత్వం మాత్రం రైతులను మిల్లర్లకు తాకట్టు పెట్టిందన్నారు.  ఈ సమావేశంలో టిపిసిసి ఆర్గనైజింగ్ కార్యదర్శి బండ శంకర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త మోహన్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కల్లెపల్లి దుర్గయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేవేందర్ రెడ్డి, గాజుల రాజేందర్, బండ భాస్కర్ రెడ్డి, మ్యాదరి అశోక్, పులి రాము, గంగం మహేష్, మున్నా తదితరులు ఉన్నారు

Related Posts