YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎంసెట్ కేంద్రాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి కడియం

ఎంసెట్ కేంద్రాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి కడియం

వరంగల్ జిల్లా, హసన్ పర్తి గురుకులంలో ప్రభుత్వ ఉచిత ఎంసెట్ కోచింగ్ సెంటర్ ను ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి మంగళవారం నాడు ఆకస్మికంగా సందర్శించారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఇస్తున్న కోచింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎంసెట్ కోచింగ్ సెంటర్లో ఎంసెట్ తో పాటు ఐఐటి, జే.ఈ.ఈ, నీట్ పరీక్షలకు కూడా కోచింగ్ ఇస్తున్నామని సిబ్బంది మంత్రి వివరించారు. ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్ పూర్తి చేసిన వారికి ఈ కోచింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉందని ఉప ముఖ్యమంత్రికి అధ్యాపకులు వివరించారు. పోటీ పరీక్షల నిర్వహణ తేదీ వరకు విద్యార్థులకు ఆయా పోటీ పరీక్షలకు నిపుణులతో కోచింగ్ ఇస్తున్నామని  సిబ్బంది చెప్పారు. కోచింగ్ సెంటర్లో 1761మంది విద్యార్థులు కోచింగ్ తీసుకుంటున్నారు.విద్యార్థులకు కొంతసూపు కెమెస్ట్రీ సబ్జెక్టును కడియం శ్రీహరి బోధించారు. రాష్ట్రంలో 26 సెంటర్లు పెట్టి ప్రభుత్వ జూనియర్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు  ఐఐటీ, జేఈఈ, నీట్ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నామని కడియం శ్రీహరి చెప్పారు.   ఒక్కో సెంటర్ పై పోటీ పరీక్షల కోచింగ్ కోసం 15 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామని అయన  వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేనన్ని గురుకులాలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఈ 3 ఏళ్లలో 577 గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు.  తెలంగాణ లో మంచి ప్రమాణాలున్న విద్య అందించడమే లక్ష్యమని అయన చెప్పారు.

Related Posts