ఈ నెల 15 తర్వాత ఏపీలో షూటింగులు: చిరంజీవి
అమరావతి జూన్ 9
ఏడాది కాలంగా కలవాలని అనుకున్నాం కుదరలేదు. ఈ రోజు కలిసాం...ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు. కరోనా కారణంగా షూటింగ్ లేక ఇబ్బంది పడ్డామని సినీ హీరో చిరంజీవి అన్నారు. మంగళవారం నాడు ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డిని సిపీ ప్రముఖులు కలిసారు. తరువాత చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ఇక్కడా జగన్ కూడా అనుమతి ఇచ్చారు. థియేటర్ లు మినిమం ఫిక్స్డ్ ఛార్జ్ లు ఎత్తివేయాలని కోరాం. నంది వేడుకలు పెండింగ్ ఉన్నాయి. లాక్‌డౌన్ సమయంలో షూటింగ్‌లు స్తంభించిపోయాయని, దీంతో షూటింగ్‌లు చేసుకునేందుకు అనుమతి ఇస్తామని జగన్ చెప్పారన్నారు. త్వరలోనే విధివిధానాలు రూపొందిస్తామని సీఎం చెప్పారని, సినీపరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారన్నారు. ప్రభుత్వం నుంచి మేము ప్రోత్సాహం కోరుకుంటాం. 2019-20 కి అవార్డుల వేడుక జరుగుతుందని భావిస్తున్నామని అన్నారు. టికెట్స్ ధరల ఫ్లెక్సీ రేట్లపై దృష్టి పెట్టాలని కోరాం...పరిశీలిస్తాం అన్నారు. అది జరిగితే పారదర్శకత ఉంటుంది...మాకు చాలా మేలు జరుగుతుంది. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి తాను వెన్నంటి ఉంటానని సీఎం చెప్పడం మా కు ఆనందం కలిగించింది. వైజాగ్ లో స్టూడియో కి వైఎస్సార్ భూమి ఇచ్చారు...దానిలో పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.