YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

రాజ్య సభ ఎన్నికల కోలహలం

రాజ్య సభ ఎన్నికల కోలహలం

రాజ్య సభ ఎన్నికల కోలహలం
బెంగళూరు జూన్ 09 
కన్నడ పాలిటెక్స్ లో రాజ్యసభ ఎన్నికల కౌట్ డౌన్ ప్రారంభమైంది.నాలుగు రాజ్యసభ స్ధానాలకు గాను అభ్యర్ధులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.జనతాదళ్ సెక్యులర్ పార్టీ అధినేత దేవెగౌడ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ దాఖలు చేశారు.ఆయన పెద్ద కుమారుడు రేవణ్ణ, చిన్న కుమారుడు కుమారస్వామితో కలసి తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణిగా వ్యవహరిస్తోన్న కర్ణాటక అసెంబ్లీ సెక్రటరీ విశాలాక్షికి సమర్పించారు. ఈ నెల 19న జరిగే ఎన్నికల్లో గెలిస్తే పెద్దల సభలో ఆయన అడుగు పెట్టడం ఇది రెండోసారి అవుతుంది. 1996లో ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు రాజ్యసభకు ఎన్నికయ్యారు.ఈ నెల 19న జరిగే రాజ్యసభ ఎన్నికల్లో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ ఇద్దరు అభ్యర్ధులను బరిలోకి దించగా కాంగ్రెస్ తరపున మల్లికార్జున ఖర్గే, జేడీఎస్ తరపున దేవెగౌడ నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఇతర ప్రముఖ నేతల కోరిక మేరకు తాను రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచానని దేవెగౌడ ఇప్పటికే స్పష్టం చేశారు. జేడీఎస్కు కర్ణాటక అసెంబ్లీలో 34 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో గెలవాలంటే కనీసం 45 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే దేవెగౌడపై బీజేపీ అభ్యర్ధిని నిలబెట్టడం లేదని తెలిసింది. కాంగ్రెస్, బీజేపీల మద్దతు కూడగట్టిన దేవెగౌడ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. 

Related Posts