YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తమిళనాడులో ఐఏఎస్ లు అంటించారు..

తమిళనాడులో ఐఏఎస్ లు అంటించారు..

తమిళనాడులో ఐఏఎస్ లు అంటించారు..
చెన్నై, జూన్ 10, 
ఇంట్లో భార్యాభర్తలు, పిల్లలు ఉంటున్నప్పుడు కూడా ఒకే చోట కూర్చోవద్దని, కలిసి భోంచేయవద్దని, కిక్కిరిసిన లిప్టుల్లో ఎక్కవద్దని కరోనా మార్గదర్శక సూత్రాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య ఆరోగ్య సంస్థలు, నిపుణులు రెండు నెలలుగా కోడై కూస్తున్నాయి. వీటిని పాటించిన వారు చాలా తక్కువ. కేవలం నిర్లక్ష్యంతో అన్ని నిబంధనలూ గాలికి వదిలేసిన వారు చాలా ఎక్కువ. లాక్ డౌన్ అంటే బయటకు రాకుండా ఇంట్లో ముడుక్కోవడం అని మాత్రమే అర్థం చేసుకున్నవారు, ఆ.. ఈ కరోనా మమ్మల్నేం చేస్తుందిలే అంటూ కనీస జాగ్రత్తలు పాటించకుండా చెడతిరిగిన వారు, చెడతిరుగుతున్నవారు చిన్న పాటి కారణాలతోటే, చిన్ని చిన్ని నిర్లక్ష్యపు తప్పులతోటే కరోనాను కౌగిలించుకుంటున్నారు. సాధారణ ప్రజలు సరే.. ఐఏఎస్ అధికారులు సైతం ఇంత చిన్న విషయాలను పట్టించుకోకుండా ప్రాణాల మీదికి తెచ్చుకుంటుంటే కరోనా వ్యాప్తి నిరోధం విషయంలో ఎవరేం చేయగలరు.. తమిళనాడు సచివాలయంలో ఒక మహిళా ఐఏఎస్ చేసిన పొరపాటు పనికి కరోనా ఆమెకు సోకడమే కాకుండా ఇప్పుడు సచివాలయంలో 40మందికి నిర్ధారణ పాజిటివ్ లక్షణాలు నిర్ధారణ కావడంతో బెంబేలెత్తుతున్నారు. ఆ దెబ్బకు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సైతం సచివాలయానకి రాకుండా గ్రీన్‌వేస్‌ రోడ్డులో తన క్యాంపు కార్యాలయంలోనే తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.తమిళనాడు సచివాలయంలో గత వారం కరోనా సోకిన ఐఏఎస్ అధికారిణి ఇంటివద్దే చికిత్స పొందుతుండగా ఆమె ద్వారా మరో 40 మందికి కరోనా పాజిటివ్ సోకటంతో సచివాలయ సిబ్బంది భయాందోళనలకు గురవుతున్నారు. 50 ఏళ్లు దాటిన ఉద్యోగులను వెంటనే ఇంటికి పంపించాలని, వారిని సచివాలయంలోకి అనుమతించరాదని సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.సచివాలయ ప్రాంగణంలోని పది అంతస్థులు కలిగిన నామక్కల్‌ కవింజర్‌ మాళిగై (భవన సముదాయం)లో సమాచార సాంకేతిక శాఖకు చెందిన ఓ కార్యాలయంలో ఐదుగురికి కరోనా సోకటంతో ఆ బ్లాక్‌లో ఉన్న కార్యాలయాలన్నింటిని మూసివేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పేషీలోని ఇద్దరు ఉద్యోగులు కరోనాబారిన పడ్డారు. దీంతో సీఎం పేషీలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కరోనా వైద్యపరీక్షలు జరిపారు. ఇక ముఖ్యమంత్రి పళనిస్వామి గత కొద్ది రోజులుగా సచివాలయానికి రావడం మానుకున్నారు. గ్రీన్‌వేస్‌ రోడ్డులో తన క్యాంపు కార్యాలయంలోనే ఎడప్పాడి తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. తమిళనాడు రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తున్న మరో ఐఏఎస్‌ అధికారిణికి కరోనా సోకింది. ఇప్పటికే సచివాలయంలో ఓ మహిళా ఐఏఎస్‌ అధికారి సహా పలువురు ఉద్యోగులు పాజిటివ్‌ లక్షణాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులలో 40 మందికి పాజిటివ్‌ లక్షణాలు నిర్ధారణ అయ్యింది.ఇక సచివాలయంలో గత వారం కరోనా సోకిన ఐఏఎస్‌ అధికారిణి ఇంటివద్దే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మరో మహిళా ఐఏఎస్‌ అధికారికి పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయి. ఇంతకు ముందు కరోనాకు గురైన మహిళా ఐఏఎస్‌ అధికారితో ఈమె రోజూ మధ్యాహ్నం ఒకే టేబుల్‌ వద్ద కూర్చుని కలిసి భోజనం చేసేవారని తెలిసింది. పది అంతస్థులు కలిగిన నామక్కల్‌ కవింజర్‌ మాళిగై భవనసముదాయాల్లో రోజూ 3300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా పై అంతస్థులలో ఉన్న తమ కార్యాలయాలకు లిఫ్టులోనే వెళ్ళాల్సి ఉంటుంది. ఒకేసారి లిఫ్టులో పదిమందిదాకా పై అంతస్థులకు వెళుతుంటారని, ఆ కారణంగానే కరోనా వైరస్‌ వ్యాపిస్తోందని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మునుపటి లాగే 33 శాతం ఉద్యోగులను మాత్రమే పనిచేయడానికి అనుమతించాలని సచివాలయ ఉద్యోగులు సంఘం నాయకులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. కాగా తమిళనాడు సచివాలయంలో ఇప్పటిదాకా కరోనా తాకిడికి గురైన ఉద్యోగుల సంఖ్య 40కి పెరిగిందని అధికారికంగా ప్రకటించారు. వీరితోపాటు మరో యాభైమందికి కరోనా పరీక్షలు నిర్వహించారని, ఆ పరీక్షా ఫలితాలు వెలువడితే కరోనా బాధితుల సంఖ్య 40 నుండి 80 దాకా పెరుగుతుందని ఉద్యోగుల సంఘాల నాయకులు ఆందోళన చెందుతున్నారు.దేశంలోనే కరోనా వ్యాప్తి అతి ప్రబలంగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటైనా తమిళనాడులో గత కొన్నిరోజులుగా రోజుకు 1500 పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

Related Posts