టాలీవుడ్ లో మళ్లీ మాటల యుద్ధం
హైద్రాబాద్, జూన్ 10
మంగళవారం నాడు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో టాలీవుడ్ సినీ పెద్దలు చిరంజీవి, నాగార్జున, సురేష్ బాబు, సి. కళ్యాణ్, దిల్ రాజు, రాజమౌళి తదితరులు హాజరయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జగన్‌తో చర్చలు జరిపిన అనంతరం ప్రభుత్వం నుంచి సానుకూలమైన హామీలు రావడంతో ఆనందం వ్యక్తం చేసింది చిరంజీవి బృందం. అయితే గత కొన్నిరోజులుగా వీరి బృంద చర్చలపై విమర్శులు గుప్పిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. మీడియా అడిగింది కాబట్టే నేను చెప్పా అంటూనే తెలంగాణ ప్రభుత్వంతో చిరు బృందం జరిపిన చర్చల్ని ఆస్తులు పంచుకోవాడానికే అంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు బాలయ్య. అయితే ఆయన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో తీవ్ర దుమారాన్ని రేపగా.. బాలయ్యను ఈ చర్చలకు పిలవకపోవడం వల్లే వివాదం అని గ్రహించిన ఇండస్ట్రీ పెద్దలు ఏపీ సీఎం జగన్‌తో జరిగిన చర్చలకు బాలయ్యకు ఆహ్వానం అందించారు.నిర్మాత సీ కళ్యాణ్ ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ.. బాలయ్యను జగన్‌తో జరిగే చర్చలకు పిలిచామని అయితే ఆయన పుట్టినరోజు ఉండటంతో రానని మీరు మాట్లాడిరండని చెప్పారంటూ మీడియా ముందే పలికాలు. దీంతో అప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో జరిగిన చర్చలకు తనను పిలవలేదని రచ్చ చేసిన బాలయ్య.. ఇప్పుడు జగన్‌తో చర్చలకు రానని చెప్పడాన్ని తప్పుపడ్డారు. అయితే ఇష్యూపై క్లారిటీ ఇస్తూ సంచలన కామెంట్స్ చేశారు నందమూరి బాలకృష్ణ. అసలు జగన్‌తో జరిగే చర్చలను నేను రాను అని చెప్పలేదంటూ వాళ్లకు వాళ్లే అన్ని నిర్ణయాలు తీసుకుని దాన్ని నాపై రుద్దుతున్నారంటూ జరిగిన విషయాన్ని తెలియజేశారు బాలయ్య.