YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 అయోధ్య ఆలయానికి శంకుస్థాపన

 అయోధ్య ఆలయానికి శంకుస్థాపన

 అయోధ్య ఆలయానికి శంకుస్థాపన
లక్నో, జూన్ 10
యోధ్యలో రామమందిర నిర్మాణానికి బుధవారం  శంకుస్థాపన జరిగింది. రామమందిర పరిధిలోని కుబేర్ తిల ఆలయం సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రుద్రాభిషేకంతో భూమిపూజ కార్యక్రమం ప్రారంభించినట్టు శ్రీరామజన్మభూమి ట్రస్ట్ తెలిపింది. కరోనా వైరస్ కారణంగా ఈ కార్యక్రమానికి అతికొద్ది మంది ప్రముఖులు మాత్రమే హాజరయినట్టు పేర్కొన్నారు. బుధవారం ఉదయం రుద్రాభిషేకంతో ఆలయ నిర్మాణం పనులు ప్రారంభమైనట్టు శ్రీరామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ అధికార ప్రతినిధి మహంత్ కమల్ నయన్ దాస్ తెలిపారు. శివుడికి రాముడు తొలిపూజ నిర్వహించిన సంప్రదాయాన్ని తాము అనుసరిస్తున్నామని ఆయన వెల్లడించారు.కుబేర తిల ఆలయం చాలా పురాతన శివాలయమని రామభక్తుడు త్రిలోకి నాథ్ పాండే అన్నారు. ఉదయం 8 గంటలకు శివాలయంలో పూజలు ప్రారంభించగా.. 10 గంటల వరకు కొనసాగాయి. మహంత్ కమల్ నయన్ దాస్, ఇతర పూజారులు కలిసి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అంతకు ముందు మే 21న, అయోధ్యలోని రామ జన్మభూమి వద్ద భూమి చదును పనులు జరుగుతుండగా.. పురాతన విగ్రహాలతో పాటు శివలింగం, ఇసుకరాయిపై చెక్కడాలు బయటపడ్డాయి. రామమందిర ప్రదేశంలో తవ్వకాల సమయంలో అనేక పురాతన శిల్పాలు వెలుగుచూశాయి.అయోధ్యలోని రామమందిర నిర్మాణం పనులు ప్రారంభం కాగా.. ఆ ప్రదేశంలోని వ్యర్థాలను తొలగించి, భూమిని చదును చేస్తుండగా శివలింగ సహా దేవతమూర్తుల విగ్రహాలు బయల్పడ్దాయి. మందిర నిర్మాణం చేపట్టనున్న స్థలానికి సమీపంలో శివలింగం, దేవతామూర్తుల విగ్రహాలు, శిల్పాలు చెక్కి ఉన్న ధ్వజాలు బయటపడినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ్‌క్షేత్ర టస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం వ్యర్థాలను తొలగించి, భూమిని చదును చేస్తుండగా అవి వెలుగుచూశాయని వివరించారు. వీటిలో ఐదు అడుగుల ఎత్తైన శివలింగం, నల్ల గీటురాయి స్తంభాలు ఏడు, ఎర్ర రాతిఇసుక ధ్వజాలు ఆరు, పలు దేవతా విగ్రహాలు ఉన్నాయి.

Related Posts