YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

 భారీగా తెలంగాణలో సాగు...

 భారీగా తెలంగాణలో సాగు...

 భారీగా తెలంగాణలో సాగు...
హైద్రాబాద్, జూన్ 10, 
రాష్ట్రంలో ఆరేళ్లలోనే పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత వానాకాలంలో కోటి మూడు లక్షల ఎకరాలు, యాసంగిలో 28 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. మొత్తం గా కోటి 31 లక్షల ఎకరాల్లో పంటలు వేసినట్లు వ్యవసా య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.అదే సమయంలో 2019-20 వానాకాలం సీజన్‌లో కోటి 22 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా, యాసంగిలో 53.82 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. అంటే రెండు సీజన్‌లలో కలిపి మొత్తంగా కోటి 76 లక్షల 48 వేల ఎకరాలలో పంటలు వేశారు. ఈ లెక్కన 2014 నుంచి 2019 వరకు అదనంగా పంటలు సాగైన విస్తీర్ణం 45.48 లక్షల ఎకరాలుగా ఉంది.ఇందులో వానాకాలం సీజన్‌లో 19.66 లక్షల ఎకరాల్లో, యాసంగిలో 25.82 లక్షల ఎకరాల్లో సాగు పెరిగింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేందుకు అనుకూలంగా ఉన్న వ్యవసాయ భూమి కోటి 70 లక్షల ఎకరాలు ఉంది. ఈసారి వానాకాలం, యాసంగి రెండు సీజన్‌లలో కలిపి కోటి 80 లక్షల ఎకరాలు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేవలం ఆరు సంవత్సరాల వ్యవధిలో ఈ స్థాయిలో పంటల సాగు విస్తీర్ణం పెరగడం గొప్ప విషయంగా వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఈస్థాయిలో సాగు విస్తీర్ణం పెరగడంపై కారణాలను వారు విశ్లేషిస్తున్నారు. ముందుగా రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చారు.మిషన్ కాకతీయ పనులతో చెరువులు నిండి, భూగర్బ జలాలు పెరగడంతో బోరు బావుల్లోకి నీరు ఉబికి వచ్చింది. దీంతో ప్రభుత్వం ఇచ్చే 24 గంటల కరెంట్‌తో రైతులు నీటిని తోడి వరితో పాటు ఇతర పంటలు సాగు చేశారు. ఇక ప్రభుత్వం రైతుబంధు పథకం తీసుకురావడం మరొక ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఎకరాకు రూ.5 వేల చొప్పున రెండు పొలంగాణసీజన్‌లకు కలిపి రూ.10 వేలు ఎంత విస్తీర్ణం ఉంటే అంత మొత్తానికి ఇచ్చారు. దీంతో పడావు పడ్డ భూములు సాగులోకి వచ్చాయి. కొందరు రైతులు తమ పొలాల్లో ఉన్న రాళ్లు, రప్పలు, చిన్న గుట్టలు వంటివి తొలగించి సాగులోకి తీసుకువచ్చారు. మరో ముఖ్యమైన అంశం సాగునీటి పారుదల ప్రాజెక్టులుగా పేర్కొంటున్నారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు ఫలితాలు రావడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందిస్తున్నారు. దీంతో తమకు ఉన్న వ్యవసాయ భూములను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువస్తున్నట్లు ప్రభుత్వ అధ్యయనంలో తేలింది.పంటల సాగు విస్తీర్ణం పెరిగిన దాని ప్రకారం ఇందులో వరి, పత్తి పంటలు ఎక్కువ ఎకరాలలో వేసినట్లు ప్రభుత్వం గుర్తించింది. 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, సాగునీటి ప్రాజెక్టులతో వరి విస్తీర్ణం ఆరేళ్లలో డబుల్ అయింది. 201415 వానాకాలంలో 22.72 లక్షల ఎకరాలలో వరి పంట సాగు కాగా 201920కి 41.19 లక్షల ఎకరాలకు పెరిగింది. యాసంగిలోనూ అప్పుడు 12.21 లక్షల ఎకరాల్లో వేస్తే మొన్నటి యాసంగిలో 39.31 లక్షల ఎకరాలకు వరిసాగు పెరిగింది. మొత్తంగా చూస్తే దాదాపు 45 లక్షల ఎకరాలు వరి సాగు పెరగడం గమనార్హం. పత్తి పంట 2014 వానాకాలంలో 41.81 లక్షల ఎకరాల్లో వేశారు. అదే 2019 వానాకాలం సీజన్‌కు 54.45 లక్షల ఎకరాల్లో సాగైంది. దాదాపు 13 లక్షల ఎకరాలపై పత్తి సాగు పెరిగింది. అదే సమయంలో మొక్కజొన్న పంట విస్తీర్ణం కొంత తగ్గింది.

Related Posts