YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం తెలంగాణ

 షేక్ పేట ల్యాండ్ లో పెద్దతలకాయలు

 షేక్ పేట ల్యాండ్ లో పెద్దతలకాయలు

 షేక్ పేట ల్యాండ్ లో పెద్దతలకాయలు
హైద్రాబాద్, జూన్ 10
షేక్‌పేట ల్యాండ్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది.భూ వ్యవహారంలో ముఖ్యంగా తహసీల్దార్ సుజాత పాత్రపై ఎసిబి అధికారులు సికింద్రాబాద్ ఆర్‌డివొ వసంత కుమారిని పిలిచి అధికారులు వివరాలు సేకరించారు. విచారణలో ఆర్‌డిఒ వసంత కుమారి వెల్లడించిన వివరాల మేరకు, షేక్‌పేట్ భూ అవినీతి వ్యవహారంలో ఎంఆర్‌ఒ సుజాత పాత్రను విచారించిన ఎసిబి అధికారులు సుజాతపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని రూ. 40 కోట్ల విలువ చేసే భూమి వివాదంలో రూ. 30లక్షలు డిమాండ్ చేసి ఎసిబికి పట్టుబడిన కేసులో ఎంఆర్‌ఒ సుజాత పాత్రపై ఎసిబి అధికారులు విచారించారు. వివాదస్థలమైన సర్వే నంబర్ 17, 19లో అబ్దుల్ సయ్యద్ ఖలీద్‌కు చెందిన ఎకరం భూమి రూ. 40 కోట్ల మేరకు ఉంటుందని, భూ సమస్యను పరిష్కారం కొరకు ఎంఆర్‌ఒ సుజాత రూ. 50లక్షలు తొలుత డిమాండ్ చేసినట్లు విచారణలో వెలుగుచూసింది. ఈక్రమంలో నేరుగా ఎంఆర్‌ఒ సుజాతను కలిసిన సయ్యద్ ఖలీద్ తాను ఏళ్ల తరబడి కోర్టులో పోరాటం చేసి సొంతం చేసుకున్న భూమికి రూ. 50లక్షలు ఇవ్వలేనని చెప్పడంతో ఒక దశలో ఎంఆర్‌ఒ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విచారణలో తేలింది.కనీసం రూ. 30 లక్షలు ఇవ్వందే పని జరగదని ఎంఆర్‌ఒ తేల్చిచెప్పడంతో పాటు ఆర్‌ఐ నాగార్జునను కలిసి లంచం మొత్తాలు ఖరారు చేసుకోవాలని సూచించినట్లు తేలింది. భూ యజమాని సయ్యద్ అబ్దుల్ ఖలీద్ ఫిర్యాదు మేరకు ఎసిబి అధికారులకు రూ. 15 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన ఆర్‌ఐ నాగార్జున రెడ్డిని, ఎంఆర్‌ఒ సుజాతలను ఎసిబి అధికారులు వేర్వేరు ప్రాంతాలలో విచారణ జరిపారు. ఈక్రమంలో ఎంఆర్‌ఒ సుజాత ఇంట్లో దొరికిన రూ. 30 లక్షల నగదు, 12 తులాల బంగారం, పలు భూములకు సంబంధించిన డాక్యూమెంట్లపై ఎసిబి అధికారులు ఆమెను ప్రశ్నించారు. అలాగే మరికొన్ని ప్రభుత్వ పత్రాల గురించి అధికారులు విచారించారు.కాగా రూ. 30లక్షల నగదు అంతా కూడా తన సంపాదనేనని సుజాత చెప్పారని, ప్రభుత్వ పత్రాల గురించి మాత్రం స్పందించలేదని సమాచారం. అయితే ఆర్‌ఐ నాగార్జున , విఆర్‌ఒ లత సహకారంతో ఆమె అవినీతికి పాల్పడుతున్నట్లుగా అధికారులు గుర్తించారు.బంజారాహిల్స్‌లోని రూ. 40 కోట్ల విలువైన స్థల వివాదం విషయంలో ఎఆర్‌ఒ సుజాత డైరెక్షన్ మేరకు ఆర్‌ఐ నాగార్జున రెడ్డి రూ. 30లక్షలు డిమాండ్ చేసినట్లు ఎసిబి విచారణలో వెల్లడైంది. బాధితుడు అబ్దుల్ సయ్యద్ ఖలీద్ తన భూమిని సర్వే చేయాలని షేక్‌పేట్ ఎంఆర్‌ఒకు ధరఖాస్తు చేసుకున్నప్పటి నుంచే అతని వద్ద భారీ మొత్తం లంచంగా తీసుకోవాలని ఎంఆర్‌ఒ, ఆర్‌ఐలు కలిసి పథకం రచించినట్లు తేలింది. ఇందులో భాగంగానే అబ్దుల్ సయ్యద్ తన భూమిలో బోర్డు పాతడంతో ఆర్‌ఐ నాగార్జున రెడ్డి సూచనల మేరకు ఎంఆర్‌ఒ సుజాత సర్వే నంబర్ 17, 19లో ప్రభుత్వ భూమి మాత్రమే ఉందని, ఖలీద్ అనే వ్యక్తి ఆ భూమిని కబ్జా చేశాడని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.దీంతో బంజారాహిల్స్ ఎస్‌ఐ రవీందర్ నాయక్ ఖలీద్ పై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఎంఆర్‌ఒ, ఆర్‌ఐ, ఎస్‌ఐలు ముగ్గూరు కలిసి బాధితుని నుంచి డబ్బు గుంజేపని ప్రారంభించినట్లు ఎసిబి అధికారుల విచారణలో తేలినట్లు తెలియవచ్చింది. దీంతో విసిగెత్తిన బాధితుడు అబ్దుల్ సయ్యద్ ఖలీద్ భూమి వ్యవహారంలో తనను లంచం డిమాండ్ చేసిన వారిపై ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఎసిబి అధికారులు షేక్‌పేట్ ఎంఆర్‌ఒ ఆఫీస్ వద్ద పథకం ప్రకారం ఆర్‌ఐని, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్‌ఐని అదుపులోకి తీసుకున్నారు.

Related Posts