YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

పిల్లలకు గ్రేడింగ్..ఇలా

పిల్లలకు గ్రేడింగ్..ఇలా

పిల్లలకు గ్రేడింగ్..ఇలా
హైద్రాబాద్, జూన్ 10
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. టెన్త్ క్లాస్ పరీక్షలు నిర్వహించకుండా.. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 5లక్షల 34వేల 903 మంది టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు. వీరిలో 5లక్షల 9వేల 079 మంది రెగ్యులర్ స్టూడెంట్స్ కాగా.. 25వేల 824 మంది ప్రైవేటు స్టూడెంట్స్ ఉన్నారు. ఇక టెన్త్లో ప్రతి సబ్జెక్టులో వంద మార్కులు ఉండగా, దీంట్లో రాత పరీక్ష ద్వారా 80 మార్కులు, ఫార్మెటివ్ అసెస్మెంట్ ద్వారా మరో 20 మార్కులు కేటాయిస్తారు. ఎఫ్ఏ పరీక్షలను అకడమిక్ ఇయర్లో ప్రతి రెండు నెలలకోసారి నిర్వహిస్తారు. ఈ మొత్తంలో యావరేజ్ మార్కులను తీసుకొని.. దానికి ఐదు రెట్లు పెంచుతారు. అలా పెంచినదాన్ని పూర్తిస్థాయి మార్కులుగా పరిగణించనున్నారు. దీని ఆధారంగా గ్రేడ్స్, పాయింట్లు కేటాయించనున్నారు. ప్రతి సబ్జెక్టుకూ ఇదే విధానాన్ని అమలు చేస్తారు. ఒక సబ్జెక్టుకి సంబంధించి నాలుగు ఎఫ్ఏ ఎగ్జామ్స్లో యావరేజ్గా 10 మార్కులు వస్తే.. పూర్తి స్థాయి మార్కులు 50 వచ్చినట్లుగా నిర్ధారిస్తారు. అదే నాలుగు ఎఫ్ఏల్లో యావరేజ్గా 20 మార్కులు వస్తే.. పూర్థి స్థాయి మార్కులు 100 వచ్చినట్లుగా పేర్కొంటారు. ఇక రెగ్యులర్ స్టూడెంట్స్కు సంబంధించిన ఈ ఇంటర్నల్ మార్కుల వివరాలను ఇప్పటికే ప్రభుత్వ పరీక్షల విభాగం ఆన్లైన్ ద్వారా సేకరించింది. వాటి ఆధారంగా ఈసారి స్టూడెంట్స్కు గ్రేడింగ్ ఇవ్వనున్నారు. ప్రైవేటు స్టూడెంట్స్కు సంబంధించి గతంలో ఎఫ్ఏ పరీక్షలు రాసి ఉంటారు కాబట్టి, ఆ మార్కులకు పరిగణనలోకి తీసుకునే చాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ప్రాసెస్ అంతా సక్రమంగా జరిగితే, వారం పది రోజుల్లో గ్రేడింగ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలున్నాయి. సర్కారు తీసుకున్న నిర్ణయంతో కేవలం స్కూళ్లలో ఇంటర్నల్గా జరిగిన పరీక్షలకు హాజరు కాని వారు మాత్రమే ఫెయిల్ అవుతారు. అయితే ఇంటర్నల్ మార్కుల్లో ప్రైవేటు స్కూల్స్ దాదాపు 20కి 20 మార్కులు వేసుకుంటారని, సర్కారు స్కూల్స్లో తక్కువ మార్కులు వేస్తారనే విమర్శ మొదటి నుంచి ఉంది.

Related Posts