YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

సిటీ బస్సులు రెఢీ

సిటీ బస్సులు రెఢీ

సిటీ బస్సులు రెఢీ
హైద్రాబాద్, జూన్ 10
 త్వరలో నగరంలో ఆర్‌టిసి బస్సులను రోడ్డు ఎక్కించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో బస్సులను తిప్పేందుకు సంబంధిత మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు ఇంత కాలం డిపోలో ఉన్నబస్సులను నగర ప్రయాణికుల కోసం సిద్దం చేస్తున్నారు. ముఖ్యంగా బస్సుల్లో తరుచు వచ్చే సాంకేతిక సమస్యలపై ప్రత్యేక దృష్టిసారించారు. అంతే కాకుండా బస్సులో ఉండే బ్యాటరీలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారు. ప్రతిబస్సును సుమారు అర్దగంటపాటు ఇంజన్‌ను స్టార్ట్ చేసి ఉంచుతున్నారు. ఇలా చేయడం ద్వారా ఇంజన్‌లో వచ్చే సమస్యలను తేలిగ్గా గుర్తించవచ్చని చెబుతున్నారు. అంతే కాకుండా బస్సులు ఇంత కాలం ఓకే చోట ఉండటంతో వాటిటైర్లలో గాలి తగ్గడమే కాకుండా వీల్‌డ్రమ్ములు మీద భారం పడుతుందని తద్వారా టైర్లు దెబ్బతినే అవకాశం ఉంది.దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించి బస్సులను తరుచుమందుకు వెనక్కు డిపోపరిసర ప్రాంతాల్లోనే తిప్పుతూ బస్సులను సిద్దం చేస్తున్నారు. అంతే కాకుండా ఇంజన్‌కు పవర్‌ను సరఫరా చేసేకేబుళ్ళను కూడా క్షుణ్ణంగా తనిఖీచేయడమే కాకుండా అవసరం అనుకుంటే వాటిని మార్చుతున్నారు. బస్సుల టర్నింగ్ సమయంలో ఇండికేటర్ల అత్యంత కీలక పాత్ర షోషిస్తాయి. వాటి మీద కూడా అధికారు ప్రత్యేక దృష్టిసారించి వాటికి సంబంధించి కొత్తగ్లాసులను బిగించడం కాని లేదా ఉన్నవాటిని మరమ్మతులు చేయడం కాని చేస్తున్నామన్నారు. గతంలో మాదిరిగాబస్సులను అన్ని రూట్లలో నడిపిస్తామని కాని కంటైన్‌మెంట్ జోన్లు ఉన్న ప్రాంతాలకు కొంత దూరంలో బస్సులను నిలిపివేయడం జరుగుతుందన్నారు. అంతే కాకుండా మాస్కులను ధరిస్తే బస్సుల్లో ఎక్కనిస్తామని ఈ విషయంలో తాము కఠినంగా ఉంటామని చెబుతున్నారు.పూర్తి స్థాయిలో శానిటైజేషన్ చేసిన తర్వాతనే బస్సులను డిపోల నుంచి బయటకు పింపిస్తామని అధికారులు చెబుతున్నారు. విధులకు హజరయ్యే సిబ్బందికి థర్మల్ స్రీనింగ్ టెన్స్ చేసిన అనంతరమే వారిని లోపలకు అనుమతిస్తామని చెబుతున్నారు. విధులకు వచ్చే ప్రతి ఉద్యోగి మాస్క్‌ను ధరించాలా చేస్తున్నామని అందులో భాగంగా నో మాస్క్… నో ఎంట్రీ పద్దతిని తప్పకుండా పాటిస్తామని చెబుతున్నారు. ప్రతీ షిష్ట్‌లో తక్కువ మంది ఉండేలా చూస్తూ , సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

Related Posts