YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

జిల్లాలో ఇసుక నిల్వలు పెంచాలి 

జిల్లాలో ఇసుక నిల్వలు పెంచాలి 

జిల్లాలో ఇసుక నిల్వలు పెంచాలి 
 ఇసుక రీచ్, పట్టా ల్యాండ్, డిపో కాంట్రాక్టర్ల సమావేశంలో జేసీ  గౌతమి 
కడప, జూన్ 10  
రానున్న వర్షాకాల అవసరాల దృష్ట్యా జిల్లాలో ఇసుక నిల్వలను పెంచేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (రైతు భరోసా, రెవెన్యూ) ఎం.గౌతమి  అన్నారు. జిల్లా స్థాయి మైన్స్ అధికారులు, ఇసుక రీచుల నిర్వాహకులను ఆదేశించారు.  జేసీ అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక రీచుల కాంట్రాక్టర్ల సమావేశం జరిగింది.  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఎలాంటి కొరత లేకుండా ఇసుక రవాణా జరిగేందుకు సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా, భవిష్య అవసరాల నిమిత్తం... ఇసుకకు అధికంగా డిమాండు వుంటుందన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న కడప, పులివెందుల, రాయచోటి, మైదుకూరు, బద్వేలు, సికె దీన్నే డిపోలలో నిల్వలు పెంచేలా చర్యలు చేపట్టాలని డిపో ఓనర్లను ఆదేశించారు. వర్షాకాల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ జూన్ నెల చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు దాదాపు రెండున్నర లక్షల టార్గెట్ ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఎంపిక చేసిన కడప, సికే దీన్నే, బద్వేలు, మైదుకూరు డిపోలకు రిజర్వు కేటగిరీ కింద ఉంచడం జరిగిందన్నారు. అందుకు అనుగుణంగా.. ఆయా డిపోల నిర్వాహకులు చర్యలు చేపట్టాలన్నారు. ముందస్తుగా పొరుమామిళ్లలో కూడా కొత్త డిపోను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు.  పట్టా భూముల్లోని ఏడు ఇసుక రీచుల్లో.. అధిక మొత్తంలో ఇసుక ఉత్పత్తి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఉన్న వనరులను ఉపయోగించుకొని.. నాణ్యమైన ఇసుకను మాత్రమే సేకరించి సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా యంత్రాంగం నిర్ణయించిన టార్గెట్ ప్రకారం నాడు-నేడు పనులకు, ఉపాధి హామీ పనులకు, డోర్ టు డోర్ ఇసుక సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఇసుక సరఫరా నిర్వహణలో ఉత్పత్తి, నిల్వలకు ఏ మాత్రం కొరత రానివ్వకూడని జేసి ఆదేశించారు. ఏపి ఎండిసి విధివిధానాలను అనుసరించి నిర్వహణలో ఎలాంటి సమస్యలు తీసుకురకూడదని సూచించారు. ఇసుక సరఫరాలో ఏ ఒక్కరూ కూడా ఎలాంటి అక్రమాలకు పాల్పడినా జరిమానతో పాటు, జైలు శిక్ష, కాంట్రాక్టు అగ్రీమెంటు రద్దు చేయడం జరుగుతుందన్నారు. ఇందుకోసం ప్రత్యేక ఎన్ ఫోర్స్ మెంట్  విభాగం పర్యవేక్షిస్తుందన్నారు. పొట్టిపాడు, జంగాలపల్లె, బాలరాజుపల్లి, కన్నెలూరు, టంగుటూరు రీచుల నుండి నాణ్యమైన ఇసుక ఉత్పత్తిని పెంచడంతో పాటు.. డిపోలలో ఏ మాత్రం కొరత లేకుండా అధిక మొత్తంలో ఇసుక నిల్వలను చేర్చేలా చర్యలు చేపట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.  కొత్త రీచులను గుర్తించేప్పుడు,  నాణ్యతమైన ఇసుక లభ్యమయ్యే చోట మాత్రమే.. జియో టాగ్ బేస్ ప్రకారం నిర్ణీత పరిధిలో ఇసుక రీచులను గుర్తించాలన్నారు. ఇందుకోసం క్షేత్ర స్థాయిలో ఆయా పరిధిలోని ఎడి లు పర్యవేక్షించాలన్నారు. నాణ్యమైన ఇసుక సౌలభ్యం ఉన్న ఏ ప్రాంతంలోనైనా ఇసుకను సేకరించే అధికారం స్థానిక రెవెన్యూ అధికారులకు ఉంటుందని, అయితే ఇసుక కొనుగోలుకు సంభందించి ఆయా గ్రామ సచివాలయంలోని సచివాలయ సెక్రెటరీల ద్వారా చాలానాలు తీయాల్సి ఉంటుందన్నారు. అలాగే.. ప్రతి ఏడాది ఇసుక రీచులలో ఇసుక ఉత్పత్తి ఉంటే.. కాంట్రాక్టులను రెన్యూవల్ చేసుకోవాల్సి వుంటుందన్నారు.  అలాగే జిల్లాలో ఎక్కడా కూడా అక్రమంగా ఇసుక రవాణా జరగకుండా సంబంధిత అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని స్టాకు పాయింట్లు, ఇసుక రీచుల వద్ద సీసీ కెమెరాల ద్వారా నిఘా పర్యవేక్షణను అమలు చేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో మైన్స్ డిడి మోహన్ రావు, జిల్లా సాండ్ ఆఫీసర్ రవి ప్రసాద్, ఎన్ఫోర్క్మెంట్ డిఎస్పీ చెంచు బాబు, జిల్లాలోని ఇసుక రీచుల కాంట్రాక్టర్లు, డిపో నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts