YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నాకు వ్యక్తిగత ఎజెండాలు లేవు

నాకు వ్యక్తిగత ఎజెండాలు లేవు

నాకు వ్యక్తిగత ఎజెండాలు లేవు
వరంగల్ జూన్ 10
పేదలకు సేవ చేయడమే మా ప్రధాన ఎజెండా అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. 15,14,13 వ డివిజన్ లకు సంబంధించిన ఎం.ఎచ్.నగర్,వీవర్స్ కాలనీ లో ప్రజల ఇండ్లపై నుండి 33 కేవీ  హైటెన్షన్ తీగలు ఉండటంతో ప్రజల సుదీర్గ కాలంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. పట్టణ ప్రగతి - 2 లో బాగంగా ఇండ్లపై నుండి వెలుతున్న 33 కేవీ హైటెన్షన్ వైర్ తరలింపు పనులను ఈ రోజు తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారు ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు..సుదీర్గ కాలంగా పేరుకుపోయిన ఈ సమస్యను తొలగించిన ఎమ్మెల్యేకు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2.28 కోట్లతో ఈ వైర్ల తరలింపు పనులు చేపట్టాం,మీరు బాగుండాలనే ఈ కార్యక్రమం చేపట్టాం. పేదల బ్రతుకులు మార్చడమే ప్రజాప్రతినిధిగా మా బాధ్యత. మీరు సంతోషంగా ఉన్నప్పుడే ఎమ్మెల్యే గా నాకు సంతృప్తినిస్తుందన్నారు..అసెంబ్లీలో పేదలకు పట్టాలు అందించాలని గళం విప్పాను. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కే.టీ.ఆర్  ను కలిసి మీ సమస్యను వివరించాను. అది పరిష్కారం కానుందన్నారు. మీ ఆశీర్వాదమే నాకు బలం. మీ జీవితాల్లో మార్పు తీసుకొస్తానన్నారు. పైరవీలకు తావు లేదు. ప్రజలకు సేవచేయడమే మాకు ముఖ్యం. పేదలకు సహాయం చేయీలనే ఉద్దేశ్యంతో సరుకుల పంపిణీ చేపట్టామన్నారు..మాకు వ్యక్తిగత ఎజెండాలు లేవు. ప్రజల సమస్యలు తీర్చడమే మా ఎజెండా అన్నారు. రాజకీయాలు చేసి ప్రజలను రెచ్చగొట్టాలనుకునేవారికి ప్రజలే సమాదానం చెప్పండి..కరోనా నేపద్యంలో జాగ్రత్తలు పాటించాలన్నారు..స్వియ నియంత్రణ పాటించాలి,మాస్కులు దరించాలని ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు శారదా సురేష్ జోషి, కావేటి కవిత రాజుయాదవ్, బయ్య స్వామి, ఓని స్వర్ణలత భాస్కర్, సోమిశెట్టి శ్రీలత ప్రవీణ్, రిజ్వానా షమీమ్ మసూద్, ముఖ్య నాయకులు,అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు..
 

Related Posts