YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా ఆంధ్ర ప్రదేశ్

కౌతాళం లో నందమూరి జన్మదిన వేడుకలు

కౌతాళం లో నందమూరి జన్మదిన వేడుకలు

కౌతాళం లో నందమూరి జన్మదిన వేడుకలు
బాలయ్య అభిమానులు సంబరాలు
కౌతాళం జూన్ 10 
నందమూరి బాలకృష్ణ జన్మదిన సందర్భంగా బాలయ్య   ఫ్యాన్స్ సంఘము అధ్యక్షులు అబ్దుల్ రహిమాన్ అద్వర్యం లో అభిమానులు సంబరాలు అంబరానంటాయి.బుధవారం ఉరుకుంద మాజి పాలక మండలి సభ్యులు చెన్న బసప్ప స్థానిక నివాసంలో ముఖ్య అతిథులుగా చెన్న బసప్ప, వెంకట పతి రాజు రాజనందు హాజరయ్యారు. బాలకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ ను కట్ చేసి ఒకరినొకరు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.వారు మాట్లాడుతూ బాలయ్య అభిమానులు మధ్య 60 జన్మదిన వేడుకలు జరుపు కోవడం చాల ఆనందంగా ఉందని, తెలుగుదేశం పార్టీ కి సహకరిస్తున్న అభిమానులకు మేము ఋణపడి ఉన్నామని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని వెన్నంటి నడిపే యువత ముందుకు రావాలని కోరారు.అభిమానులందరికి బాలకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ జన్మదిన వేడుకల్లో చెన్న బసప్ప, వెంకటపతి రాజు, డాక్టర్ రాజనందు, కాశి మంజు  బాలయ్య అభిమానులు అబ్దుల్ రహిమాన్, విరేశ్ కృష్ణ, అరిఫ్ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts