బోయిన్ పల్లి మార్కెట్ మూసివేత
హైదరాబాద్ జూన్ 10
కరోనా మహమ్మారి తాకిడి బోయిన్ పల్లి మార్కెట్ కు కూడా తగిలిన నేపథ్యంలో మార్కెట్ ను ఈ రోజు నుండి మూడు రోజుల పాటు మూసి వేయనున్నట్లు మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ ప్రకటించారు. కరోనా లక్షణాలతో బాధపడుతు గాంధీ ఆసుపత్రిలో చేరిన కూరగాయల వ్యాపారి చికిత్స పొందుతూ మూడు రోజుల క్రితం మరణించడం జరిగింది. తరువాత మరో ఇద్దరికి కూడా పాజిటివ్ అని తేలడంతో మార్కెట్ లోని ప్రతి ఒక్కరు భయాందోళనలకు గురవుతున్నారు. బోయిన్ పల్లి మార్కెట్ కమిటీ కమిషన్ ఏజెంట్లతో సమావేశమైన పాలన యంత్రాంగం మూడు రోజులపాటు మార్కెట్ ను మూసి వేయాలని నిర్ణయించింది. మూడు రోజుల్లో మార్కెట్ లోని షాపులలో ప్రాంగణమంతా రసాయనిక ద్రావణం తో పిచికారీ చేయనున్నట్లు శ్రీనివాస్ వెల్లడించారు. కేసులు ఇంకా ఎక్కువ అయితే మార్కెట్ మూసివేత కొనసాగుతుందని పేర్కొన్నారు. వినియోగదారులు రైతులు అందరూ ఇతర మార్కెట్లకు వెళ్లి కూరగాయల క్రయ విక్రయాలు జరుపుకోవాలని సూచించారు.