YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చేదోడువాదోడు చెక్కుల పంపిణీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి

చేదోడువాదోడు చెక్కుల పంపిణీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి

చేదోడువాదోడు చెక్కుల పంపిణీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి
చిత్తూరు, జూన్ 10
స్థానిక జిల్లా సచివాలయంలో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న చేదోడు పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన అనంతరం చిత్తూరు జిల్లా జగనన్న చేదోడు పథకం కింద 15,320 మంది రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీలకు రూ.15.32 కోట్లు విలువగల మెగా చెక్కును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజు మరియు వాణిజ్య పన్నుల శాఖా మంత్రి కె. నారాయణ స్వామి, చిత్తూరు ఎంపి రెడ్డెప్ప తదితరులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పంపిణీ అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజు మరియు వాణిజ్య పన్నుల శాఖా మంత్రి  మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సర కాలం పూర్తి అయ్యిందని, ఈ సందర్భంగా నవరత్నాల్లో తెలియజేసిన కార్యక్రమాలన్నింటినీ దాదాపు 95 శాతం పూర్తి చేశామని తెలిపారు. జిల్లా కలెక్టర్ జిల్లా అభ్యున్నతి ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి ఇంటికి దాదాపు 50 వేల రూపాయల నుండి 60 వేల రూపాయల దాకా ఆర్థిక సహాయం ను అందించడం జరిగిందని తెలిపారు. అంబేద్కర్ కన్న కలలను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారన్నారు. గ్రామ స్వరాజ్యం లో భాగంగా ప్రజల సంక్షేమం కొరకు గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రభుత్వం తీసుకు వచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న చేదోడు పథకం ద్వారా మొత్తం 2,47,040 మందికి రూ.247.04 కోట్లు ఆర్థిక సహాయం మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే చిత్తూరు జిల్లా లో ఈ పథకం కింద రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ లు మొత్తం 15,320 మంది లబ్ధిదారులకు రూ.15.32 కోట్లను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. నిర్మాణ పనులకు టెండర్లు పివడం జరుగుతూ ఉందన్నారు. ప్రతి రైతుకు సాగునీరు, ప్రతి ఇంటికి త్రాగునీరు అందించేందుకు ఈ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. రాష్ట్ర పంచాయతీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లా అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. సారాయి, గంజాయి అన్నది ఎక్కడా లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిని మనసారా దీవించాలని కోరుకుంటున్నానని తెలిపారు. డా. అనితారాణి ఎవరో నాకు తెలియదు అని, డాక్టర్లు అంటే నాకు దేవుళ్ళతో సమానం అని ఈమె విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి సిఐడి విచారణకు ఆదేశించియున్నారని, ఈ విచారణకు సంబందించి నివేదిక వచ్చిన తరువాతే నిజానిజాలు తెలుస్తాయని తెలిపారు. అనంతరం చిత్తూరు ఎం పి రెడ్డెప్ప మాట్లాడుతూ చిత్తూరు జిల్లా యంత్రాంగం లోని అన్ని శాఖలు చక్కగా పని చేస్తున్నదని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు అభినందననలు తెలియజేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కులాలు, మతాలకు అతీతంగా పని చేస్తున్నారని తెలిపారు. డాక్టర్ అనితారాణి విధి నిర్వహణలో ఉన్నప్పుడు తనకు అవమానం జరిగిందని ఆరోపించియున్నారని, ఇదివరకు పని చేసిన జిల్లాల్లో ఆమె సర్వీసెస్ అవసరం లేదని జిల్లా కలెక్టర్లు ఆమెని ప్రభుత్వానికి సరెండర్ చేయడం జరిగిందని తెలిపారు. చిత్తూరు జిల్లా ప్రశాంతమైన జిల్లా అని తెలిపారు. ఆమె నీలాపనిందలు వేయడం మంచిది కాదని తెలిపారు. ఆమెకు అన్యాయం జరిగితే న్యాయం చేయడంలో మేము ముందుంటామని తెలిపారు.   ఈ విలేకరుల సమావేశంలో చిత్తూరు, సత్యవేడు ఎంఎల్ఏ లు ఆరాణి శ్రీనివాసులు, ఆదిమూలం, జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్తా, జెసి (అభివృద్ధి) వి.వీరబ్రహ్మం, చిత్తూరు ఆర్డిఓ డా. రేణుక తదితర అధికారులు పాల్గొన్నారు.

Related Posts