YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కేంద్ర పెత్తనం ఎక్కువయింది

కేంద్ర పెత్తనం ఎక్కువయింది

కేంద్ర పెత్తనం ఎక్కువయింది
విజయవాడ జూన్ 10
కోవిడ్ పేషెంట్ లకు అంతా కలిపి నెలకు యనభై వేల రూపాయలు అవుతాయి. ప్రైవేటు ఆసుపత్రిలో కోవిడ్ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం నిర్ణీత ధరలు నిర్ణయించి.. వసూలు చేసేలా చూడాలి. కానీ కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల నుంచి దోచుకుంటున్నాయని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. ఫిక్కీ ప్రతిపాదనను అందరూ ఆమోదించి, ఆచరించేలా చూడాలి. లాక్ డౌన్ కారణంగా ప్రజలు అందరూ ప్రభుత్వానికి సహకరించారు. కోవిడ్ నివారణకు ఆసుపత్రి లో సౌకర్యాలు కల్పచాలని మేము చెబుతూనే ఉన్నాం. కానీ కేంద్రం ఇరవై లక్షల ప్యాకేజీ ప్రకటించి గొప్పలు చెప్పుకుంది. 
దీని వల్ల సామాన్య ప్రజలకు ఎటువంటి న్యాయం జరగదు. సంపద సృష్టించే వలస కార్మికుల కష్టాల ను ప్రభుత్వం పట్టించుకోలేదు. 
ఇరవై కోట్ల మంది వలస కార్మికులు మన దేశంలో ఉన్నారని మా అంచనా అని అయన అన్నారు. ఎనిమిది కోట్లు అన్న కేంద్రం.. బడ్జెట్ ప్రకారం ఒక్కో కార్మికునికి నాలుగు వందలు కేటాయించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకే లాక్ డౌన్ ఆలస్యం గా ప్రకటించారు. కేంద్రం వల్లే నేడు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయని అయన విమర్శించారు. అంతా అయ్యాక... మమ్మలను క్షమించండి అని మోడీ, అమిత్ షా లు దండాలు పెడుతున్నారు. బీహార్ లో ఎన్నికలు వస్తున్నందునే.. ఈ కొత్త దండాలు. కోవిడ్ మరణాలు.. కేంద్ర సర్కారీ హత్యలుగానే భావిస్తున్నాం. కోవిడ్ సాయం విషయంలో కమ్యూనిస్టు ల తప్పు కూడా ఉందని భావిస్తున్నాం. కార్మికుల కష్టాలు చూసి.. మేము ఇంట్లో కూర్చోకుండా బయటకు రావాల్సింది. ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేసేలా బిజెపి పాలన ఉందని అయన అన్నారు. మద్యం షాపులు రాష్ట్రాల పరిధిలో ఉన్నా అనుమతి ఇచ్చింది.. కేంద్రమే కదా. కోవిడ్ నియమాలను కేంద్రమే పూర్తిగా ఉల్లంఘన చేసింది. కోవిడ్ ను అడ్డం పెట్టుకుని.. బిజెపి రహస్య ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్రాల పై కేంద్రం పెత్తనం కూడా బాగా ఎక్కువైందని అయన అన్నారు.

Related Posts