పుంజుకున్న వ్యాపారాలు
విశాఖపట్నం జూన్ 10
కేంద్ర ప్రభుత్వ లాక్ డౌన్ నిబంధనల తో విశాఖలో సుదీర్ఘ విరామం తరువాత షాపింగ్ మాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఎలక్ట్రానిక్స్ దుకాణాలు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు తెరుచుకున్నాయి.కరోనా ప్రభావంతో ఆర్ధికంగా నష్టపోయిన యజమాన్యాలు ప్రభుత్వ నిబం ధనల అమలు చేస్తున్నారు. వచ్చే ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా ధర్మల్ టెస్ట్ నిర్వహిస్తున్నారు.ఓ వైపు కరోనా విజృంభిస్తున్న ... మరోవైపు ప్రజలు తమ కార్యకలాపాల్లో బిజీ అవుతున్నారు. ఈ సారి కేంద్రం హోటల్, రెస్టారెంట్లుకు అవకాశం ఇవ్వటంతో వ్యాపారా లను కొనసాగిస్తున్నాయి.అయితే ప్రజల నుంచి అంతంతమాత్రంగానే స్పందన కనిపించింది. అత్యవసరమైనవారే కొనుగోళ్ల కోసం వచ్చే వాళ్లకు ప్రజలకు ధర్మల్ పరీక్షలను నిర్వహిస్తు న్నారు. అన్నిచోట్లా కరోనా కట్టడి చర్యలను తీసుకున్నారు. దుకాణాల్లో కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించేలా మార్కింగ్‌లు వేశారు. ప్రతి ఒక్కరికీ థర్మల్ స్క్రీనింగ్ చేశారు. శానిటైజ్ అయ్యాకే లోపలికి అనుమతించారు. షాపింగ్‌మాల్స్ కు వచ్చిన వారి నుంచి పేరు, ఫోను నెంబరు, చిరునామాలు తీసుకున్నారు. పదేళ్లలోపు పిల్లలను, 65 సంవత్సరాలు పైబడినవారిని అనుమతించడం లేదు. రెస్టారెంట్లలో 50 శాతం సిటింగ్ సామర్థ్యాన్ని తగ్గించడంతో ఆ దిశగా మార్పులు చేశారు. అయితే కంటైన్‌మెంట్ జోన్‌లో ఉన్న జగదాంబ, పూర్ణామార్కెట్, డాబాగార్డెన్స్, సూర్యాభాగ్‌లలో వస్త్ర దుకాణాలు, షాపింగ్‌మాళ్లు, సెల్‌ఫోన్ దుకాణాలను తెరవలేదు.రెస్టారెంట్లలో 20 శాతం వ్యాపారం జరిగిందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.