YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

పత్తికొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా జిట్టా లక్ష్మీదేవి

పత్తికొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా జిట్టా లక్ష్మీదేవి

పత్తికొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా జిట్టా లక్ష్మీదేవి
 ఎమ్మెల్యే సమక్షంలో చైర్మన్ గా ప్రమాణ స్వీకారం 
పత్తికొండ జూన్ 10 న్యూస్ పల్స్) 
పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా జిట్టా లక్ష్మీదేవి బుధవారం రోజున ప్రమాణస్వీకారం చేశారు. నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం నందు  పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి మరియు వైయస్సార్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ రెడ్డిల ఆధ్వర్యంలో పత్తికొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్  గా జిట్టా లక్ష్మీదేవిని,వైస్ చైర్మన్ గా కట్టారుకొండ నగరి మాధవరావు ను ఎన్నుకొని వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.వీరితో పాటుగా  పాలక మండలి సభ్యులను కూడా ఎన్నుకొని ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవి కు మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ లక్ష్మీదేవి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం తుగ్గలి మండల కన్వీనర్ జిట్టా నాగేష్ మాట్లాడుతూ తన సతీమణి లక్ష్మీదేవిని పత్తికొండ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి,జిల్లా ఇన్చార్జి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారికి మరియు పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవి గారికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు మండలంలోని వైసీపీ నాయకులకు మరియు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.తనపై నమ్మకం ఉంచి మార్కెట్ కమిటీ  ఛైర్మెన్ పదవి అప్పగించినందుకు రైతుల శ్రేయస్సు కొరకు మరియు పార్టీ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తామని వారు తెలియజేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతుల కొరకు ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్క రైతుకు  అందేలా కృషి చేస్తామని తెలిపారు.పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవి అడుగు జాడల్లో నడుస్తూ పార్టీ కోసం మరియు రైతుల సంక్షేమంకోసం కృషి చేస్తామని వారు తెలియజేశారు.అనంతరం ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ పత్తికొండ మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ పదవి మొదటిసారిగా మహిళకు దక్కడం చాలా సంతోషమని తెలియజేశారు. ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో మహిళల కొరకు ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని తెలియజేశారు. ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే దాదాపుగా ఇచ్చిన హామీలన్నీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని ఆమె సభాముఖంగా తెలియజేశారు.రాష్ట్రం ఒక వైపు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా,మరోవైపు కరోనా వైరస్ పై రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతూనే అన్ని పథకాలను లబ్ధిదారులకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆమె తెలియజేశారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి,అన్ని రకాల సహాయ చర్యలను ప్రభుత్వం రైతులకు  అందిస్తుందని ఆమె తెలియజేశారు.మార్కెట్ ద్వారా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి రైతులు సంతోషంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె తెలియజేశారు.చివరిగా ఎమ్మెల్యే పత్తికొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ యొక్క చైర్మన్,వైస్ చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు శ్రీరంగడు, పగిడిరాయి జగన్నాథరెడ్డి,తుగ్గలి ప్రహల్లాద రెడ్డి,బసి రెడ్డి, చెన్నంపల్లి వెంకటేశ్వర రెడ్డి,శభాష్ పురం హనుమంతు,రాతన మోహన్ రెడ్డి,రాతన ఉమన్న,తుగ్గలి మోహన్ రెడ్డి మరియు నియోజకవర్గంలోని వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related Posts