కబ్జాదారుల నుండి మా స్థలాన్ని విడిపించండి.
పాములపాడు జూన్ 10
కబ్జాదారుల నుండి తమ స్థలాన్ని విడిపించాలని పాములపాడు ముస్లిం మైనార్టీ పెద్దలు తహసీల్దార్ రాజేశ్వరి కి వినతి పత్రం అందజేశారు వివరాల్లోకి వెళితే పాములపాడు మండల కేంద్రంలోని జామియా మస్జిద్ పక్కన రాస్తా లో తెలుగు విజయ అనే మహిళ తన మేనమామ తలారి మల్లయ్య సహాయం తో 2017 సంవత్సరం లో అక్రమ రిజిస్టర్ చేయించుకున్నారని 2016 సంవత్సరంలో పాత మసీదు స్థానంలో కొత్తగా నిర్మాణం చేపట్టామని అయితే దక్షిణం వైపు వర్షపు నీరు వెళ్లేందుకు స్థలం వదిలి పెడితే ఇదే అదునుగా భావించి వారు ఇలా చేశారని వారు ఆరోపించారు ఏప్రిల్ 17వ తేదీన బోరు వేస్తుండగా అడ్డగించినా అధికారుల సహాయంతో తలారి మల్లయ్య దగ్గరుండి అక్కడ బోర్ వేయించారని ఆరోపించారు ఏప్రిల్ నెల లాక్ డౌన్ ఉన్న బోరు వేయించి లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని అధికారులు వెంటనే కలుగజేసుకోవాలని కోరారు