YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం సినిమా ఆంధ్ర ప్రదేశ్

విశాఖకు టాలీవుడ్...

విశాఖకు టాలీవుడ్...

విశాఖకు టాలీవుడ్...
విశాఖపట్టణం, జూన్ 11,
రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి సినీ పరిశ్రమ వెళ్లాలనుకుంటుందా..? విశాఖ రాజధానిగా సీఎం జగన్‌ అడుగులు వేస్తున్న తరుణంలో ఇండస్ట్రీ అభివృద్ధికి కూడా బీజం పడుతోందా..?సినీ పరిశ్రమతో సత్సంబంధాలు కోరుతున్న జగన్‌ సినీ ప్రముఖుల భేటీలో ఎలాంటి హామీలిచ్చారు..? విశాఖ రాజధానిగా సినీ పరిశ్రమ నిలదొక్కుకుంటుందా..? ఏపీలో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై తొలి అడుగు పడింది. జగన్ సర్కార్ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా పరిశ్రమ పెద్దలు సీఎంతో భేటీ అయ్యారు. పైకి కామన్‌ మీటింగ్‌లా కనిపిస్తున్నా చాలా కీలక నిర్ణయాలకు బీజం వేసినట్లు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వం వచ్చాక విశాఖను ఎగ్జిక్యూటీవ్ రాజధానిగా ప్రకటించారు. ఈ క్రమంలో సినీ పెద్దల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో చిత్ర పరిశ్రమ వేళ్లూనుకోడానికి అడుగులు పడ్డట్లైంది. చిరంజీవి, నాగార్జున వంటి సీనియర్ హీరోలతో పాటు దర్శక నిర్మాతలు జగన్‌తో భేటీ అయ్యారు. షూటింగ్‌లు, ప్రభుత్వ ప్రోత్సాహం వంటి కీలక అంశాలపై చర్చించారు. ఏపీలో షూటింగ్‌లకు అనుమతిచ్చామని మంత్రి పేర్ని నాని వివరించారు. నందీ అవార్డుల వేడుకను త్వరలోనే నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. చెన్నై తర్వాత పరిశ్రమకు చెందిన అప్పటి పెద్దలంతా కలిసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఇప్పుడు విశాఖకు కూడా అలాంటి వైభవం తీసుకొచ్చేందుకు ఇప్పటి పెద్దలు కీలక అడుగులు వేస్తున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం వలే ఇండస్ట్రీకి పెద్దపీట వేసేందుకు జగన్ సర్కార్‌ కూడా ముందడగు వేస్తోంది. సినీ పెద్దలతో సత్సంబంధాలకు అనుకూలంగా ఉండటం కూడా ఇందుకు మరో కారణం. అయితే హైదరాబాద్‌లో మాదిరిగా విశాఖలో పరిశ్రమల నిలదొక్కుకుంటుందా అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది. కానీ ప్రస్తుతం మాత్రం ఇటు తెలంగాణలో అటు ఆంధ్రలో ఇండస్ట్రీ విషయంలో ప్రభుత్వాలు చిత్తశుద్దితో ఉండటంతో పరిశ్రమలో పండగ వాతావరణం నెలకొంది.

Related Posts