YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 హాట్ టాపిక్ గా మారిన బాలయ్య జోస్యం

 హాట్ టాపిక్ గా మారిన బాలయ్య జోస్యం

 హాట్ టాపిక్ గా మారిన బాలయ్య జోస్యం
హైద్రాబాద్, జూన్ 11,
అదేంటో ఏపీ రాజకీయాలకే ఈ పదం ప్రత్యేకం. మిగిలిన చోట్ల కూడా రాజకీయం ఉన్నా ఏపీకి మాత్రమే అతుక్కుపోయే పదం వెన్నుపోటు. తెలుగుదేశం పార్టీతో లింకప్ అయి దశాబ్దాలుగా కొనసాగుతున్న పదం కూడా ఇదే. 1984, 1995…ఇలా కేవలం దశాబ్ద కాలంలో రెండు మార్లు టీడీపీలో వెన్నుపోట్లు జరిగి అన్నగారిని కుర్చీ దించేశారు. మొదటి వెన్నుపోటు నాదెండ్ల భాస్కరరావు చేస్తే రెండవ వెన్నుపోటు నట్టింట్లో స్వయాన అల్లుడు చంద్రబాబు నాయకత్వంలో జరిగింది. ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు. అందుకే రెండవది విజయవంతమై ఎన్టీయార్ పదవీ పోయింది, ఆనక ప్రాణమూ పోయింది. సరే ఇదంతా ఎందూకంటే మళ్ళీ వెన్నుపోటు పదం ఇపుడు తరచూ వినిపిస్తోంది కాబట్టి.జగన్ సీఎంగా అయిదేళ్ళు ఉండరు, తొందరలోనే ఎన్నికలు వస్తాయి. బంపర్ మెజారిటీతో చంద్రబాబు సీఎం అవుతారు అన్నారు ఆయన గారి బావమరిది బాలయ్య. మరి ఆయన రాజకీయం ఎమ్మెల్యేగా ఆరేళ్ళు మాత్రమే. పైగా పార్ట్ టైం పాలిటిక్స్ చేసే బిజీ నటుడు ఆయన. మరి ఆయన జోస్యాన్ని పట్టుకుని గట్టిగా మాట్లాడేందుకు వీలుందా. అంటే ఆయన బాబు ఇంటి మనిషి. నిప్పులేందే పొగరాదు. బాలయ్య బోళాతనంతో అలా బయటకు చెప్పేశారు కానీ జగన్ ని దించేందుకు తెరవెనక కుట్ర జరుగుతోంది అంటున్నారు వైసీపీ అభిమానులు. ఇదే విషయాన్ని వైసీపీ మద్దతుతారు,సినీ నటుడు పోసాని క్రిష్ణ మురళి తనదైన స్టయిల్లో చెప్పుకొచ్చారు.మీరు వెన్నుపోట్లు పొడిచి జగన్ సర్కార్ని కూలదోయాలనుకుంటే కుదరదు, ఇక్కడ ఉన్నది ఎన్టీఆర్ కాదు, జగన్, ఆయన ఒకరికి వెన్నుపోటు పొడవరు, తాను కూడా పొడిపించుకోరు అంటూ గట్టిగానే రిటార్ట్ ఇచ్చారు. జగన్ అయిదేళ్ళ సీఎం మాత్రమే కాదు, ఆయనే మరో రెండు టెర్ములు అంటే మరో పదేళ్ళు సీఎంగా ఉంటారని కూడా పోసాని ఢంకా భజాయించారు. సరే పోసాని లెక్కలు, ఆయన రాజకీయ అవగాహనతో ఇవన్నీ చెప్పినా ఆయన అన్న మాటలను బట్టి చూస్తే వెన్నుపోటు కుట్ర టీడీపీ నుంచే జరుగుతోందని చెప్పేస్తున్నారు. మరి జగన్ కి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆయన్ని కూలదోయడం సాధ్యమా.ఇక కొన్నాళ్ళ క్రితం ఇదే రకమైన మాటను విశాఖ ఆక్టోపస్ గా తనను తాను ప్రకటించుకున్న మాజీ ఎంపీ సబ్బం హరి కూడా చెప్పారు. చంద్రబాబుకు మరీ హీనంగా 23 సీట్లే జనం ఇచ్చారని, అవి కానీ డబుల్ అయి ఉంటే జగన్ ని ఈపాటికి పక్కకు పెట్టేసేవారని కూడా హరి హాట్ కామెంట్స్ చేశారని భొగట్టా. అంటే చంద్రబాబు విపక్షంలో ఉన్నా కూడా రివర్స్ గేర్ లో ఫిరాయింపులు జరిగి జగన్ కుర్చీకి ఎసరు పెట్టేవారని, అలా పెట్టాలని టీడీపీ తమ్ముళ్ళ ఆశ, కోరిక అన్నది హరి చెప్పకుండా చెప్పేసారుగా. ఇక మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం జగన్ కి బంపర్ మెజారిటీ ఉందని, అలాగని ధీమాగా ఉంటే కుదరదు అని ఎన్టీయార్ కి పెద్ద మెజారిటీ వచ్చినపుడే రెండు మార్లు వెన్నుపోట్లు జరిగాయని అప్పట్లోనే గుర్తు చేశారు. మొత్తానికి జగన్ దూకుడుగా వెళ్తున్నారు. మరో వైపు సొంత పార్టీలో ఎమ్మెల్యేలు అసమ్మతి గళాలు మెల్లగా వినిపిస్తున్నారు. ఇంకో వైపు ఇలా పసుపు పార్టీ పెద్దలు అపశకునాలు పలుకుతున్నారు. రాజకీయాల్లో ఎంత ధీగా ఉన్నా ఏదీ అసాధ్యం మాత్రం కాదు అని చెప్పవచ్చు. అందువల్ల జగన్ తరచూ తన వెన్నును చూసుకుంటూ అప్రమత్తంగా ఉండడం బెటరేమో.

Related Posts