YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

15 రాష్ట్రాల్లో ఇంటింటి సర్వేలు

15 రాష్ట్రాల్లో ఇంటింటి సర్వేలు

15 రాష్ట్రాల్లో ఇంటింటి సర్వేలు
న్యూఢల్లీ, జూన్ 11
దేశవ్యాప్తంగా కోవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్‌ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. మళ్లీ వర్క్‌ ఫ్రం హోం ప్రారంభిస్తున్నట్టు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ  తెలిపింది. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారికి మాత్రమే కార్యాలయాల్లోకి అనుమతినిస్తున్నట్టు, మిగతావారు ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. కంటైన్‌మెంట్ జోన్ పరిధిలో ఉన్న ఉద్యోగులు ఇంట్లో నుంచే పనిచేయాలని చెప్పింది. జ్వరం, దగ్గు లక్షణాలు ఉంటే ఆఫీసులకు రావద్దని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఒక్కో విభాగంలో రోస్టర్ పద్ధతిన 20 మంది సిబ్బంది లేదా అధికారులకు మాత్రమే అనుమతి ఉంటుందని కేంద్రం తెలిపింది. సెక్రటరీ స్థాయి అధికారులు రోజు విడిచి రోజు హాజరుకావాలని వెల్లడించింది. అలాగే ఎదురెదురుగా కూర్చోవద్దని, ఇంటర్ కాం లోనే మాట్లాడుకోవాలని తెలిపింది. మాస్కు, ఫేస్ షీల్డ్ తప్పనిసరిగా వాడాలని, మాస్కు పెట్టుకోకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సమావేశాలు నిర్వహించాలని తెలిపింది. కామన్ ఏరియాలో ప్రతి గంటకోసారి శుభ్రం చేయాలని, కంప్యూటర్ కీబోర్డులు ఎవరివి వారే శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలని తెలిపింది. తమను తాము కాపాడుకొని, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఉద్యోగులంతా తాజా మార్గదర్శకాలను తప్పక పాటించాలని కేంద్రం చెప్పింది.మహమ్మారి కట్టడికి కేంద్ర బృందాలు - స్ధానిక అధికారులకు దిశానిర్ధేశందేశవ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతి తగ్గకపోవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలకు సాయంగా 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 50కి పైగా జిల్లాలు, నగరపాలక, మున్సిపాల్టీలకు అత్యున్నత కేంద్ర బృందాలను పంపాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.మహారాష్ట్ర(ఏడు జిల్లాలు/మున్సిపాలిటీలు), తెలంగాణ (4 జిల్లాలు), తమిళనాడు (7), రాజస్ధాన్‌ (5), అసోం (6), హరియాణ (4), గుజరాత్‌ (3), కర్ణాటక (4), ఉత్తరాఖండ్‌ (3), మధ్యప్రదేశ్‌ (5), పశ్చిమ బెంగాల్‌ (3), ఢిల్లీ (3), బిహార్‌ (4), యూపీ (4), ఒడిషాలో 5 జిల్లాలకు కేంద్ర బృందాలు రానున్నాయి. ఆయా జిల్లాల్లో కోవిడ్‌-19 వ్యాప్తి, సంక్రమణను అడ్డుకునేందుకు అనువైన వ్యూహాలు, ప్రణాళికలను రూపొందించడంలో స్ధానిక అధికారులకు కేంద్ర బృందాలు మార్గనిర్ధేశకం చేస్తాయి.భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు ఉధృతమవుతూనే ఉన్నాయి. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో 9,987 కేసులు నమోదుకాగా, మహమ్మారి బారినపడి 331 మంది చనిపోయారు. 

Related Posts