భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగం కు రంగం సిద్ధం చేసింది ఈ నెల 12 వ తేదీ తెల్లవారు జామున పీఎస్ ఎల్వీ- సి41 రాకెట్ ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్ -1 ఐ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు దీని ద్వారా భారత భూభాగం పైన జీపీఎస్ సిస్టం అందుబాటులోకి వస్తుంది . వాయిస్ ఓవర్ -శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుండి ఈ నెల 12 తెల్లవారుజామున 4 గంటల 4 నిమిషాలకు పీఎస్ ఎల్వీ -సి 41 రాకెట్ ద్వారా ఇండియన్ రీజినల్ నావిగేటివ్ శాటిలైట్ సిస్టం ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి సర్వం సిద్ధం చేసారు ఇప్పటి వరకు 42 పీఎస్ ఎల్వీ తరహా రాకెట్లను ప్రయోగించిన ఇస్రో ఇప్పుడు 43 వ రాకెట్ ను ప్రయోగిస్తోంది 44 .4 మీటర్లు ఎత్తు 331 టన్నుల బరువు కలిగిన పీఎస్ ఎల్వీ - సి41 రాకెట్ ద్వారా పంపుతున్న ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహం 1425 బరువు ఉంటుంది ఇప్పటివరకు ఇస్రో ఎనిమిది ఉపగ్రహాలను ప్రయోగించగా అందులో ఒకటి విఫలం కావడం జరిగింది ఇప్పుడు తొమ్మిదవ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తోంది ఈ ఉపగ్రహాలన్నింటిని భారత భూభాగం చుట్టూ తిరుగుతూ GPS తరహా లో పనిచేస్తుంది భారత భూభాగం సరిహద్దులనుండి 1500 కిలోమీటర్లు వరకు భూమి పైన ,ఆకాశ మార్గం లోను ,సముద్ర మార్గం లో దశ దిశా నిరాదరణకు ఈ ఉపగ్రహాలు ఉపకరిస్తాయి. ఏడు ఉపగ్రహాలను అన్ని దిక్కుల్లో తిరిగే విధముగా ఉపగ్రహాలను ఇస్రో శాస్త్రవేత్తలు రూపకల్పన చేయడం జరిగింది ప్రయోగం అనంతరం 19 నిమిషాలకు ధ్రువ క్షక్షలోకి చేరుకునే ఉపగ్రహాన్ని మూడు రోజుల పాటు మరింత ఎత్తుకు తీసుకు వెళ్లే పనిని ప్రారంభిస్తారు భూమికి 36000 కిలోమీటర్ల ఎత్తులో ఉపగ్రహాన్ని నిలుపుతారు..