YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

ఏపీ డిగ్రీ కాలేజీల్లో ఒకే ఫీజు

ఏపీ డిగ్రీ కాలేజీల్లో ఒకే ఫీజు

ఏపీ డిగ్రీ కాలేజీల్లో ఒకే ఫీజు
విజయవాడ, జూన్ 11,
విద్య విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో వచ్చే విద్యా సంవత్సరం (2020-21) నుంచి ప్రయివేటు డిగ్రీ కాలేజీల్లో ఒకే తరహా ఫీజు విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం.2020-21 విద్యా సంవత్సరం నుంచి మూడేళ్ల కాలానికి కొత్త ఫీజులను ఖరారు చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సిద్ధమవుతోంది. సంప్రదాయ డిగ్రీ కోర్సులకు సంబంధించిన ఫీజుల్లో కాలేజీల వారీగా వ్యత్యాసం ఉండరాదన్న ఉద్దేశంతో కమిషన్‌ ఏకరూప ఫీజు ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.మరో వారం రోజుల్లో కొత్త ఫీజుల నిర్ణయ ప్రక్రియను కమిషన్‌ పూర్తి చేయనుంది. రాష్ట్రంలో మొత్తం 1,441 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 1,153 ప్రైవేట్‌ అన్ ‌ఎయిడెడ్‌ కాలేజీలు, 137 ఎయిడెడ్‌ కాలేజీలు, 151 ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి. ఎయిడెడ్‌, ప్రభుత్వ కాలేజీలకు కళాశాల విద్య కమిషనరేట్ ‌(సీసీఈ) ఫీజులను నిర్ణయిస్తుంది.ఒక ప్రయివేటు‌ అన్ ‌ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీలకు మాత్రం తొలిసారిగా ఉన్నత విద్య నియంత్రణ కమిషన్‌ ఫీజులను నిర్ణయించనుంది. ఒకేతరహా ఫీజు ఎలా ఉండాలన్న దానిపై రెండు రకాలుగా ఆలోచనలు పరిశీలనలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.ఒకటి.. రాష్ట్రంలోని అన్ని కాలేజీలకు ఒకే రకమైన ఫీజును నిర్ణయించడం. రెండోది.. కాలేజీలను రెండు లేదా మూడు కేటగిరీలుగా విభజించి ఫీజులను నిర్ణయించడం. ఈ రెండింటిలో ఏదో ఒక విధానాన్ని ఫైనల్‌ చేయనున్నారు. త్వరలో ఈ విషయంపై స్పష్టత రానుంది.

Related Posts