YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

7 ప్రశ్నలకు చాలా అద్భుతంగా  జవాబు చెప్పిన సాదుసంతు

7 ప్రశ్నలకు చాలా అద్భుతంగా  జవాబు చెప్పిన సాదుసంతు

*7 ప్రశ్నలకు చాలా అద్భుతంగా  జవాబు చెప్పిన సాదుసంతు ,*
*1 వ ప్రశ్న:*  ప్రపంచం లో ఏది పదునైనది?
*జ:* చాలా  మంది కత్తి అని చెప్పారు 
*సాదు:*  కాదు ,మనిషి నాలుక, ఎందుకంటే ఈ నాలుక తో మనుషులు ఇతరుల మనస్సును,వాళ్ళ నమ్మకాలను విరగ్గొట్టేస్తారు.
*2వ ప్రశ్న:* మనకు అత్యంత దూరం  లో వున్నది ఏమిటి ?
*జ:* చాలా మంది చంద్రుడు ,సూర్యుడు ,గ్రహాలూ
*సాదు:* మనకు అత్యంత దూరం లో వున్నది గడిచిపోయిన కాలం ,ఎంత ప్రయత్నించినా ఆ కాలాన్ని  తీసుకురాలేము,ఆ కాలం లో కి వెళ్లలేము.అందుకే వున్న ఈ సమయాన్నే మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలి.ఎంత డబ్బు వున్నా కూడా మనం గడిచిన కాలం లోకి వెళ్లలేము.
*3వ ప్రశ్న:*  ప్రపంచం లో పెద్దది ఏది?
*జ:* చాలా మంది పర్వతం ,సూర్యుడు ,భూమి 
*సాదు:* ప్రపంచం లో పెద్దది మన పాపమే
*4వ ప్రశ్న*  ప్రపంచం లో కఠినంగా,బరువుగా ఉండేది ఏది ?
*జ:* చాలా మంది స్టీల్,ఐరన్,ఏనుగు అని చెప్పారు.
*సాదు:* కఠినమైనది అనేది "మాట ఇవ్వడం"
మాట ఇవ్వడం తేలికే కానీ నిలబెట్టుకోవడమే చాలా కష్టం.
*5వ ప్రశ్న:* ప్రపంచం లో తేలికైనది ఏది?
*జ:* దూది,గాలి,ఆకులు అని చెప్పారు 
*సాదు:* ప్రపంచం లో తేలికైనది అనేది ఒకరిని చూసి వ్యంగ్యంగా మాట్లాడడం.
*6వ ప్రశ్న:* మనకు దెగ్గరగా వున్నది ఏది?
*జ:* తల్లి తండ్రులు ,స్నేహితులు ,బంధువులు అని చెప్పారు 
*సాదు:* మనకు దెగ్గరగా ఉండేది మన చావు.
అందరూ దూరమైనా కూడా ఎప్పుడో ఒకప్పుడు చావు అనేది కచ్చితం.
*7వ ప్రశ్న:* ప్రపంచం లో సులువైనది ఏది ?
*జ:* తినడం ,పడుకోవడం,తాగడం,తిరగడం  
*సాదు:*  ప్రపంచం లో సులువైనది అనేది మరొకరి  మనస్సును విరగ్గొట్టడం,ఇంతకంటే సులువు  ఏదీ లేదు.
మనం తెలుసుకోవలసిన జవాబులు.మనం అనుకొన్నవి కానే కావు.

వరకాల మురళి మోహన్ సౌజన్యంతో
 

Related Posts