YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి

 ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి

 

 ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి
విజయవాడ జూన్ 11, 
 జగనన్న చేదోడు పథకం జగన్మయా నాటకం.  అధికారంలోకి రావడం తోనే కాపు నేస్తం ద్వారా కాపులకు, రజక వృత్తి లో ఉన్నటువంటి రజకులందరికి, నాయి బ్రాహ్మణ లందరికీ కులాలకు అతీతంగా కుట్టు పనులు చేసుకునే టైలర్లు (దర్జీలు) అందరికీ ఆర్థిక సహాయం అందిస్తామన్న మాటలు ఈరోజు చేతలలో కనబడడం లేదని మాజీ ఎమ్మెల్యే, తంగిరాల సౌమ్య అన్నారు.  ఆయా కులాల వారందరికీ ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి మధ్యలో షాపులు ఉన్న వారికేనంటూ మాటమార్చి చివరకు లబ్ధి చేకూరే సమయానికి కొందరినే ఎంపిక చేసి ఆయా కులాల వారిని మోసగించిన వైనం ప్రజలందరూ గమనించాలి.  నందిగామ నియోజకవర్గంలో 1027 మంది రజకులు లబ్ది కి అర్హులు అని ముందుగా చెప్పి తీరా ఇవ్వబోయే సమయానికి 275 మందిని మాత్రమే ఎంపిక చేయడం ఎటువంటి నీతి అనేది ప్రజాప్రతినిధులు ప్రజలకు సమాధానం చెప్పాలి.  నియోజకవర్గంలో   678మంది నాయి బ్రాహ్మణులను ఎంపిక చేసి తీరా లబ్ది చేకూర్చపోయే సమయానికి  197 మందికి మాత్రమే లబ్ధి చేకూర్చడం అన్యాయం కాదా, అదే విధముగా  3519 మంది దర్జీలతో దరఖాస్తు చేయించి ధనము ఇవ్వబోయే సరికి 1151 మందిని మిగల్చడం ఇది జగన్మాయ కాక ఏమి అవుతుంది అదే విధముగా కాపులకు గతంలో రిజర్వేషన్ ను ఎగరకొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాపు నేస్తం ద్వారా 2320 మందితో దరఖాస్తు చేయించి కేవలం ఈ పథకాన్ని 29 మందికి మాత్రమే అమలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు.  రమేష్ కుమారును ఎలక్షన్ కమీషనర్ గా కొనసాగించాలని హై కోర్టు ఇచ్చిన తీర్పు పై సుప్రీమ్ కోర్టులో అప్పీలు చేసిన ఏపి  సర్కారుకు మరొకమారు భంగపాటు తప్పలేదు.  హైకోర్టు ఇచ్చిన తీర్పు సమంజసమేనని  సుప్రీమ్ కోర్టు ధర్మాసనం చెప్పడం ద్వారా ఏపి  సర్కార్ ఆలోచనలు ఏవిధంగా ఉన్నాయో ప్రజలు ఆలోచించాలి.  రాజ్యాంగసంస్థలతో ఆడుకోవడం తగదుఅని సుప్రీమ్ ధర్మాసనం హెచ్చరించిన దరిమిలా ఒక్క నిమషం కుడా ముఖ్యమంత్రి పదవిలో జగన్మోహన్ రెడ్డి ఉండడానికి అనర్హుడు అన్న విషయం తేటతెల్లం అవుతుంది.  రాజ్యాంగ వ్యవస్థల పట్ల, న్యాయ వ్యవస్థల  పట్ల గౌరవం ఉంటె జగన్మోహన్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలనీ ఆమె డిమాండ్ చేసారు..

Related Posts