తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటూ అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని.. కొన్ని చోట్ల వడగళ్లు పడవచ్చని అధికారులు చెప్తున్నారు.ఈమధ్య కురిసిన వర్షాలకు రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోయారు. ఎండకాలంలో వర్షాలు కురవడంతో వాతావరణంలో తీవ్ర స్థాయిలో మార్పులు చోటుచేసుకున్నాయి. వర్షాలు తగ్గి వాతావరణం చక్కపడటంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. ఇంతలోనే మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. ఉపరితల అల్పపీడన ద్రోణి కారణంగా క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, పిడుగులు పడతాయని, హెచ్చరికలు వచ్చిన ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రస్తుత నైరుతి సీజన్ లో కృష్ణా, గోదావరి బేసిన్ లో సంతృప్తికర వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, వాతావరణ నిపుణులు అంచనా వేశారు. గోదావరి ఎగువ పరివాహక ప్రాంతమైన తెలంగాణలో నాలుగు నెలల నైరుతి సీజన్ లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించారు.పంటలు వేసుకునే వాళ్లకు మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెప్తున్నారు. పంటలు చేతికొచ్చిన వాళ్లు మాత్రం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.