పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలను పార్టీలకతీతంగా పంపిణీ చేయాలి
నంద్యాల జూన్ 11,
నంద్యాల నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వము పంపిణీ చేయబడుతున్న నిరు పేద ప్రజలకు ఇచ్చే ఇళ్ల స్థలాలలో వివక్ష చూపకుండా అర్హులైన వారికే పంపిణీ చేయాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి. ఎస్. బాబా ఫక్రుద్దీన్. సీపీఐ సీనియర్ నాయకుడు ఏ ఐ టి యు సి అధ్యక్షుడు శ్రీనివాసులు. ఏ ఐ టి యు సి నియోజకవర్గ కార్యదర్శి వి. బాల వెంకట్. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయుడు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి. జి సోమన్న. ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి సురేష్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక సిపిఐ కార్యాలయం నందు గురువారం నాడు విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గం పట్టణ పరిధిలో అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులు సిఫార్సు చేసిన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుందని ఆరోపించారు. ప్రభుత్వం నియమించిన వార్డు వాల్ ఎంట్రీలు. గ్రామ వాలంటరీ లు. ఇంటింటికి తిరిగి ఇళ్ల స్థలాలు లేని వారికి గుర్తించక. పరిశీలించకుండా వార్డు గ్రామ అధికార పార్టీ ఇన్చార్జి ల పేర్లు ఇచ్చిన వారికే వారి పేర్లను నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. నంద్యాల నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు. వక్ఫ్ బోర్డు భూములు. పెత్తందార్లు కబ్జా చేసి ఉన్న వాటి గురించి రెవెన్యూ యంత్రాంగం పరిశీలించ కుండ. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన స్థలాలు పరిశీలించి గుర్తించి పట్టాలు ఇచ్చిన వాటి పైన పట్టాలు ఇచ్చి గ్రామాలలో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. వెంటనే రెవెన్యూ అధికారులు పేద ప్రజలకు ఇచ్చే ఇళ్ల స్థలాల పై సమగ్రంగా పరిశీలించి అర్హులైన వారికి ఇచ్చే విధంగా కృషి చేయాలని లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని నాయకులు హెచ్చరించారు. .