YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కలెక్టర్ ఎంవి శేషగిరిబాబు తో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి భేటీ 

కలెక్టర్ ఎంవి శేషగిరిబాబు తో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి భేటీ 

కలెక్టర్ ఎంవి శేషగిరిబాబు తో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి భేటీ 
నెల్లూరు జూన్ 11,
నెల్లూరు జిల్లా డాక్టర్ ఎంవి శేషగిరి బాబుతో నెల్లూరు గ్రామీణ నియోజవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా రైతు సంఘం నేతలు గురువారం భేటీ అయ్యారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు 9 కోట్ల రూపాయలు, అక్కడ పనిచేసే కూలీలకు 2 కోట్ల రూపాయలు మరియు రవాణా చేసిన వాహనాలకు 14 లక్షల రూపాయల బకాయిలను వారికి వెంటనే ఇచ్చేలా  చర్యలు తీసుకొని కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
చెరుకు రైతుల విషయాన్ని జిల్లా మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి గార్ల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది అని చెప్పారు.
చెరకు రైతుల పట్ల సానుకూలంగా స్పందించి, న్యాయం జరిగేలా చూస్తామని జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Related Posts