YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 కేంద్ర ప్రభుత్వం వాటా లేని సంక్షేమ పథకాలు లేవు

 కేంద్ర ప్రభుత్వం వాటా లేని సంక్షేమ పథకాలు లేవు

 కేంద్ర ప్రభుత్వం వాటా లేని సంక్షేమ పథకాలు లేవు
రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం
కామారెడ్డి జూన్ 11
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో లో కేంద్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు వాటి విధి విధానాలు గూర్చి ప్రజలకు తెలియ చేయడానికి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడానికి కార్యకర్తలు సన్నద్ధం కావాలని బీజేపీ జిల్లా నాయకులు చంద్రారెడ్డి సూచించారు. బుధవారం రోజు భిక్కనూర్ మండల బిజెపి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ  మాటలు తప్ప చేతలు లేని తెలంగాణ ప్రభుత్వం, కేంద్రం ఇచ్చే నిధులతో ప్రభుత్వాన్ని నడుపుతూ మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని, మోదీని నిందించడం విచారకరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ వాటా లేని సంక్షేమ పథకాలు లేవని పేర్లు మార్చి, కేసీఆర్ ఫోటో వేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్లుగా డబ్బా కొట్టుకుంటుందని అన్నారు. రేషన్ బియ్యం, ఉపాధి హామీ పథకం, పింఛన్లు, వ్యవసాయ మద్దతు ధర, అంగన్ వాడి, డబల్ బెడ్ రూమ్, సడక్ యోజన, 14 ప్రణాళిక కింద గ్రామాలకు నేరుగా నిధులు, ముద్ర రుణాలు, కిసాన్ సమ్మన్ యోజన కింద ఒక రైతుకు 6000, విద్య యూనివర్సిటీలు మొన్న కరోన సహాయార్ధం జాన్ ధన్ ఖాతాలు ఉన్న మహిళలకు 500, 5 కిలోల బియ్యం కిలో కంది పప్పు, ఫుట్ పాత్ వ్యాపారులకు 10,000 రుణం, వ్యాపారస్తులకు రుణాలు, పాడి రైతులకు రుణాలు ఇలా మోదీ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటుందని అన్నారు. రెండవ సారి మోదీ ప్రధానిగా అయ్యాక 370 ఆర్టికల్ రద్దు, ట్రిబుల్ తలాక్ బిల్లు లాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకుందని వాటిని ప్రతి ఇంటికి తీసుకు పోవడానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని అన్నారు. అనంతరం కార్యకర్తలచే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డి గారి రమేష్ రెడ్డి, బల్ల శీను, ప్రవీణ్, కిట్టు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts