YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 కావలిలో తెలుగుదేశం పార్టీ  కార్యాలయానికి భూమి పూజ

 కావలిలో తెలుగుదేశం పార్టీ  కార్యాలయానికి భూమి పూజ

 కావలిలో తెలుగుదేశం పార్టీ  కార్యాలయానికి భూమి పూజ
బహిర్గతమైన వర్గ పోరు 
నెల్లూరు  జూన్ 11
కావలిలో నేలమట్టం అయివున్న తెలుగుదేశం పార్టీని తిరిగి పునర్నిర్మించే కార్యక్రమానికి  మాజీ శాసనసభ్యుడు , తెలుగుదేశం కావలి ఇంఛార్జి  కాటంరెడ్డి విష్ణువర్ధనరెడ్డి  పూనుకోవడం అభినందించాల్సిన అంశమే . గత ఏడాది కాలంగా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ దిక్కూదివానం లేక వెలవెల పోతుంది . తమను కాపాడే నాయకుడు తెలుగుదేశంలో లేరని భావించుకొన్న చాలామంది దేశం కార్యకర్తలు , నాయకులు వైస్సార్సీపీలోకి వలసబాట పట్టారు . వుండే ఆ పదిమంది నాయకుల్లో రెండు గ్రూపులు . ఒక గ్రూపు ఉప్పు అంటే మరో గ్రూపు నిప్పు అంటుంది . ఇటీవల కావలిలో జరిగిన ఎన్ఠీఆర్ , బాలకృష్ణ ల జన్మదిన వేడుకలు -  రెండు గ్రూపులు ఎవరికి వారే యమునాతీరే అన్నట్లు నిర్వహించుకోవడం అందుకు అద్దంపడుతోంది . ఒక గ్రూపు పూర్తిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు , శాసనమండలి సభ్యులు బీదా రవిచంద్ర కనుసన్నల్లో నడుస్తుండగా - మరో గ్రూపును కాటంరెడ్డి విష్ణువర్ధనరెడ్డి నడిపిస్తున్నారు . లాక్ డౌన్ సమయంలోనూ ఏ గ్రూపుకాగ్రూపే సేవాకార్యక్రమాలు నిర్వహించాయి . ఈ నేపథ్యంలో తిథి, ముహూర్తం బాగుందని  విష్ణువర్ధనరెడ్డి భావించాడో ఏమో గాని -   పార్టీ తాత్కాలిక  కార్యాలయ నిర్మాణానికి నడుం బిగించాడు .  మాజీ మునిసిపల్ చైర్మన్ గ్రంధి యానాదిశెట్టి కుటుంబం చేత భూమి పూజ చేయించాడు . యానాదిశెట్టి అల్లుడు పోతుగంటి శ్రీకాంత్ ను , కుమార్తె మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ ఆలేఖ్యను పీటల మీద కూర్చో పెట్టి భూమి పూజ తంతు   ముగింపజేశాడు . ఈ భూమి తంగుటూరి శివప్రసాద్ కు సంబంధించినదిగా తెలుస్తుంది . ఐదేళ్లపాటు అంటే వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికలదాక  విష్ణువర్ధనరెడ్డి కంట్రోలులో ఆ నిర్మించబోయే తాత్కాలిక కార్యాలయం వుండేలా వుంది . ఈ భూమిపూజా కార్యక్రమం ఉప్పు వర్గం చేయగా - నిప్పు వర్గం ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం .
 

Related Posts