YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రైతుల అందోళన

రైతుల అందోళన

రైతుల అందోళన
జగిత్యాల జూన్ 11 
జగిత్యాల జిల్లాలో బుధవారం రాత్రి   కురిసిన ఈదురుగాలులు, అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి పోవడం తో రైతులు రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు.  జగిత్యాల జిల్లా రాయికల్  మండలంలో మొత్తం  10 ఐకెపి కేంద్రాల్లో  కొనుగోలు మరియు ధాన్యం తరలింపు  100%పూర్తి కాగా , ఈ సెంటర్ల ద్వారా 1851 రైతుల నుంచి  85, 814  క్వింటా ల్లు అంటే  15కోట్ల74 లక్షల రూపాయల దాన్యం కొనుగోలు చేశారు. మండలంలోని 5సింగిల్ విండోల పరిధిలో అల్లీపూర్ ఉప్పమడుగు భూపతిపూర్ ఇటిక్యాలలో వంద శాతం పూర్తి అయ్యాయి. కానీ  రాయికల్ సింగిల్ విండో పరిధిలో ఉన్న  రామాజీపేట లో 430 బస్తాలు ,  రాయికల్ లో   1300 బస్తాలు,  శివాజీనగర్  3000, కొండాపూర్ 400, కొత్తపేట 550, మైతాపూర్ లో   7500 బస్తాలు  బస్తాలు లిఫ్ట్ చేయవలసి ఉంది .కానీ ఇప్పటికీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఆగ్రహించిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ , ధర్నా నిర్వహించారు..

Related Posts