YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ముగిసిన మంత్రివర్గ భేటీ వైఎస్సార్ చేయుత కు అమోదం

ముగిసిన మంత్రివర్గ భేటీ  వైఎస్సార్ చేయుత కు అమోదం

ముగిసిన మంత్రివర్గ భేటీ
వైఎస్సార్ చేయుత కు అమోదం
అమరావతి జూన్ 11
రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. వైఎస్సార్ చేయూత పథకానికి కెబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు నాలుగేళ్లలో 50 వేల ఆర్థిక సాయం ప్రభుత్వం అందించనుంది. వచ్చే ఆగస్టు 12న  సీఎం జగన్ ఈ పధకాన్ని ప్రారంభిస్తారు. రామాయపట్నం పోర్టుకు కేంద్రం నిధులపై కెబినెట్ లో చర్చ జరిగింది. విభజన హామీల్లో భాగంగా రామాయపట్నం పోర్టుకి కేంద్రం నిధులివ్వాల్సి ఉందని భేటీ అభిప్రాయపడింది. కేంద్ర నిధుల కోసం ప్రయత్నాలు చేస్తూనే ప్రాజెక్టుపై ముందుకెళ్లాలని కెబినెట్ నిర్ణయించింది. ఐదు దశల్లో రామాయపట్నం పోర్టు ప్రాజెక్టు నిర్మాణం కానుంది. మొదటి దశలో . 4736 కోట్ల వ్యయం అవనుంది. రామాయపట్నం ఆగస్టు నాటికి టెండర్లు పిలవాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. రామాయపట్నం పోర్టు టెండర్లను జూడిషీయల్ ప్రివ్యూకి పంపాలని సీఎం జగన్ ఆదేశించారు. 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం ఇచ్చింది. డిస్కమ్, ట్రాన్స్కో లకు 6 వేల కోట్ల ఆత్మనిర్బర్ భారత్ నిధుల ఖర్చుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహణకు కూడాకేబినెట్ ఆమోదం తెలిపింది. 

Related Posts