బాసర లో రెచ్చిపోతున్న ఇసుక బకాసురులు
నిర్మల్ జూన్ 11
బాసర తీరా ప్రాంత గోదావరి లో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది విదేశీ టెక్నాలజీ ని ఉపయోగించి గోదావరి నాదిలో లోతయిన నీటి నుండి ఇసుకను సునాయాసంగా తీసే యంత్రాన్ని తయారుచేసి గోదావరి నాదిగర్భం నుండి ఇసుక తీసి ఇసుక మాఫియా ఎద్దేఛ్చాగా దోచేస్తున్నది. .ఇసుక మాఫియా గుట్టు చప్పుడు కాకుండా గోదావరి నాది నుండి ఇసుకను తొవ్వి ప్రతీ రోజు రాత్రి వేళలో లక్షలు విలువచేసే ఇసుకను పక్క రాష్ట్ర మైన మహారాష్ట్రా కు తరలించి అమ్మేస్తున్నారు. పర్యావరణానికి హాని కల్గించే విధంగా భారీ యంత్రాలతో గోదావరి నదిలో తవ్వకాలు చేపట్టకూడదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అదేశలించినా కొంత మంది అక్రమార్కులు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు. నది మధ్యలో తూములు ఏర్పాటు చేసి అత్యాధునిక యంత్రాలు సాంకేతిక పరిజ్ఞానం తో గోదావరి నదిలో గర్భం లో వైపులను బిగించి ఇసుక ను తోడేస్తూ న్నారు బాసర సమీపంలో గోదావరి తిర ప్రాంతం లో ఒక్కొక్క లారీ ఇసుక దాదాపుగా 80 వేలనుంచి 90వెయ్యిల వరకు డిమాండును బట్టి అమ్ముతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.... ఇసుక తోడుతున్న విధానాన్ని చుస్తే కండ్లు బైర్లు కమ్ముతాయి. టెండరు అయినా ఇసుకను సైతం నాలుగు అడుగుల లోతు తొవ్వడానికి అనుమతులు ఉండవు కానీ బాసర గోదావరిలో అక్రమంగా 30 అడుగుల లోతు తొవ్వేస్తున్నారు. గోదావరి నది ఒడ్డు దాదాపు రెండువందల మీటర్ల లోతు ఉంటుంది ఆ ఒడ్డును జేసీబీ సహాయంతో మట్టిని తోడుతూ నదిలోకి రోడ్డును వేశారు నదిలో బంకమట్టి పూడిక పుడికలోకి వాహనాలు వెళితే 50 అడుగులలోతు కు కూరుకు పోతుంది అలాంటి రొంపి హుభిలో భారీ చెట్లను నరుక్కొని తెచ్చివేసి చెట్ల పైన మట్టిని వేసి ర్యాంపును తయారు చేశారు నదిలో నీళ్లు భారీగానే ఉన్నప్పటికీ నీటి లోతు నుండి ఇసుకను తొడుతున్నారు.... భారీ డీజిల్ యంత్రాన్ని పడవలో బిగించి యంత్రానికి స్క్రూ కన్వేయర్ ద్వారా డీజిల్ ఇంజన్ హైస్పీడ్ పవర్ తో 6 ఇంచుల పైపులోకి నీరు తో పాటు ఇసుకను వేగంగా ముందుకు నెట్టుతూ ఒడ్డుకు చేరుస్తోంది నీళ్లు ఇసుక నెల పై పడగానే నీళ్లు వేరుగా వెళ్లిపోతాయి ఇసుక మాత్రం ఒకేచోట కుప్పగా ఏర్పడుతుంది , నీటిలో ఉన్న బోటు నుండి ఒడ్డువరకు నీళ్ల పైన పైపులు తేలియాడే విదంగా కాలి డ్రమ్ములను సాయంతో నీటిలో తేలియాడే వంతెనను ఏర్పాటు చేసి ఆ వంతెన పైనుండి పైపు లైనులు వేసి నది ఒడ్డు వరకు నిర్మిచారు. ఒడ్డుకు చేరిన ఇసుక ని జెసిబి సాయం తో ట్రాక్టార్ల తో వేరే ప్రాంతానికి తరలించి రాత్రి వేళలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు... బాసర లోని కొందరు స్థానిక రాజకీయనాయకులు ఇతర వ్యక్తులు కలిసి ముఠా గా ఏర్పడి అక్రమ ఇసుక రవాణా చేస్తూ కోట్లు దండుకుంటున్నారు... ఈ విషయం బాసర మండలం లోని అధికారులకు తెలిసిన పట్టించుకోవడం లేనందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు...