YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కరోనా విషయంలో సర్కార్ వైఫల్యం

కరోనా విషయంలో సర్కార్ వైఫల్యం

కరోనా విషయంలో సర్కార్ వైఫల్యం
హైదరాబాద్ జూన్ 11 
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేని పరిపాలన కొనసాగుతుంది. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెక్రటేరియట్ ఉందా లేదా తెలియడం లేదు. సీఎం పేషీ ఎక్కడ ఉందో తెలియదు. సమాన్యులకి,ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సీఎం ని కలిసే అవకాశం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. సెక్రటేరియట్ ఉందా లేదా..? మంత్రుల పేషీ ఉందా ..! అని కాంగ్రెస్ శాసనసభ్యులం  వెళ్లి చూడలనుకున్నాం. ప్రగతిభవన్ టీఆరెస్ ఎమ్మెల్యేలు,అధికారుల వాడుకుంటున్నారు. రాష్ట్రంలో సీఎం,మంత్రులు ఉన్నారా లేరా అనేది ఒక ప్రశ్నగా మారింది. సమస్యలు ఎవరికి చెప్పుకోవలో దిక్కు లేని పరిస్థితి ఏర్పడింది. మూడున్నర ఏళ్ల నుండి సంగారెడ్డి లో సింగూరు, మంజీరా డ్యామ్ లో నీళ్ల లేవు. అరునెల లకు ఒకసారి కాళేశ్వరం నుండి నీళ్లు తీసుకొస్తామని అంటారు కానీ తీసుకొనిరారు. జిల్లా మంత్రి హరీష్ రావు మొక్కుబడిగా జిల్లాకి వచ్చి వెళ్తారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న సీఎం లు సామాన్యులకు,ఎమ్మెల్యేకు సమయమిచ్చి సమస్యలు తెలుసుకునే వారు.  టీఆరెస్ ఎమ్మెల్యేలు సీఎం  గేట్ వద్దకు వెళ్ళే పరిస్థితి లేదని అయన అన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు వెళ్లి సమస్యలు చెప్పుకుందమంటే పోలీసులను పెట్టి అరెస్ట్ లు చేస్తారు. ప్రతిపక్షాలను,ప్రతిపక్షల గొంతులను ప్రభుత్వం నొక్కేస్తుంది. ఆకలైతే అన్నం ,దహమైతే నీళ్లు  ఇవ్వమని అడిగే పరిస్థితి రాష్ట్రంలో లేదు. ఈ ప్రభుత్వం ప్రజా హక్కులను కలరాస్తుంది. ప్రజా సమస్యలు వెలుగులోకి రాకుండా చేస్తుంది. కేసీఆర్ చెప్పిన్నట్లు చేయకపోతే ప్రతిపక్షాలను,ప్రజలను పోలీసులతో అరెస్ట్ చేయించి కోర్ట్ ల చుట్టూ తిప్పుతున్నారు. ఇంత అహంకారమైన పరిపాలన 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయలేదని అయన అన్నారు. ప్రజల మీ పరిపాలనకు చరమగీతం పడే సమయం వచ్చింది. కారోనో పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గాంధీ హాస్పిటల్ లో సరైన చికిత్స అందడం లేదు. రాష్ట్రంలో గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే ప్రజలు భయపడుతున్నారు. కేసీఆర్ ఉచిత సలహాలు ఇస్తున్నారు మటన్,చికెన్ తినండి అని . కారోనా తో హాస్పిటల్ లో చేరిన వారికి సరైన ఆహారం మాత్రం అందడం లేదు. డాక్టర్ లకు సరైన సదుపాయాలు కలిపించడం లేదు. రాష్ట్రంలో కారోనో విజృంభిస్తుంది అంటే దీనికి కేసీఆర్ ప్రభుత్వమే కారణం. ప్రజాసమస్యలు తెలుసుకోవడంలో,కారోనో కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫైల్ అయిందని అయన విమర్శించారు. 

Related Posts