ఆస్ట్రేలియా ఎన్నారై కాంగ్రెస్ సమావేశంలో వంశీచంద్ రెడ్డి మరియు అద్దంకి దయాకర్
బారతదేశం ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడాలంటే రాహుల్ గాంధీ ప్రదాని కావడమే మార్గమని, రాహుల్ ని ప్రధాని చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డ మరియు అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు... ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మరియు టీపిసిసి ఎన్నారై సెల్ సంయుక్తంగా నిర్వహించిన సమావేశానికి అథితులుగా పాల్గొని ప్రసంశించారు.. మూడున్నరేండ్ల కాలంలో మోడి పరిపాలన నిరుపేదలను చిన్నాభిన్నం చేసిందని, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని వారు ఆరోపించారు... మోడి తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ లో ఇద్దరు చంద్రులను గుప్పిట్లో పెట్టుకొని వారి అక్రమాలను సమర్థిస్తూ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా రాజకీయ అవినీతిని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.... విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకున్నా ప్రశ్నించలేని స్థితిలో ఇద్దరు చంద్రులు నెట్టివేయబడ్డారు అని అన్నారు.... తెలంగాలో ప్రజాస్వామిక హక్కులు కాలరాయబడుతున్నాయని ప్రశ్నించిన వారిని అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని, ఇందుకోసమేనా తెలంగాణ తెచ్చుకపన్నామని ప్రశ్నించారు... తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, వందలాది పథకాల పేరుతో ప్రజలను వంచిస్తున్నారని చెప్పారు... 24 గంటల కరెంట్ ఇవ్వడమనేది ప్రజధనాన్ని దుర్వినియోగం చేయడమే అని, విద్యుత్ యూనిట్ కొనుగోలుకు ఎక్కువ ధర వెచ్చించి రైతులపై అధిక భారం వేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు...
ప్రాజెక్టుల రీడిజైన్ అనేది పెట్టుబడిదారులకు దోచిపెట్టి, వాళ్ళిచ్చే కమిషన్ లకు ఏజెంట్ గా కేసీఆర్ మారిండని విమర్షించారు.. రేపు తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టడం కాయమని ప్రాజెక్టుల రీడిజైన్ లో ఉన్న లోపాలను సవరించి, టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమాలను బయటపెడతామని తెలిపారు...మీరు మోసం జరగలేదని నిరూపించకోవాలంటే బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు... ఎన్నారైలు దేశ, రాష్ట్ర అభివ్రుద్ధికోసం సలహాలు, సూచనలు ఇవ్వటమే కాకుండా నవ భారత నిర్మాణానికి సిద్దంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ వారికి అవకాశం కల్పిస్తుందని తెలిపారు...
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చేర్మన్ సామ్ పిట్రోడా ఆదేశానుసారం టీపిసిసి ఎన్నారై సెల్ కన్వీనర్ గా కొనసాగుతున్న మన్యం.రాజశేఖర్ రెడ్డి సేవలను గుర్తించి ఆయనను
నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆస్ట్రేలియా విభాగంభాద్యతలు అప్పగించారు మరియు టీపీసిసి ఎన్నారై సెల్ ఆస్ర్టేలియా దేశం విక్టోరియా రాష్ర్టానికి కో-కన్వీనర్ గా మరియు ఎన్నారై కాంగ్రెస్ యూత్ విభాగం సిడ్నీ అధ్యక్షుడిగా రంగినేని అనిల్ రావు, ఉపాద్యక్షనిగా మురళిని నియమించారు..
తదనంతరం ప్రవాసాంద్రుల ప్రశ్నలకు దాదాపు 3గంటలల పాటు వంశీచంద్ రెడ్డి మరియు దయాకర్ గార్లు సమాధానమిచ్చారు...