YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

 టెకీకి నరకం చూపించాడు

 టెకీకి నరకం చూపించాడు

 టెకీకి నరకం చూపించాడు
హైద్రాబాద్, జూన్ 11
హైదరాబాద్‌లో అమానుష ఘటన వెలుగు చూసింది. మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై లైంగిక దాడికి పాల్పడిన యువకుడు ఆ దారుణాన్ని వీడియో తీసి బెదిరిస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. ఆ కామాంధుడి చేతిలో నెలల పాటు నరకాన్ని అనుభవించిన బాధితురాలు చివరికి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించడంతో ఆ దుర్మార్గుడి బాగోతం బయటపడింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన యువతి బీటెక్‌ చదివి కొంతకాలం క్రితం ఓ ఇంటర్వ్యూకి వెళ్లింది. అక్కడ రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఆమెకు పరిచయమయ్యాడు. ఆమె ఫోన్ నంబర్ తీసుకున్న యువకుడు తరుచూ మాట్లాడుతూ పరిచయం పెంచుకున్నాడు. పార్టీలకు పిలుస్తూ సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఓ రోజు పార్టీ పేరుతో హోటల్‌కు పిలిచి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెపై లైంగిక దాడికి పాల్పడి సెల్‌ఫోన్లో వీడియో తీశాడు. అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. ఆ వీడియోను అడ్డం పెట్టుకుని ఆ నీచుడు వేధింపులకు పాల్పడేవాడు.రోజూ ఆమెకు వీడియో కాల్స్ చేస్తూ నగ్నంగా కనిపించాలంటూ వేధించేవాడు. ఛాతీపై కత్తితో గాట్లు పెట్టుకోవాలని, రక్తం కారుతుండగా తాను చూడాలని ఒత్తిడి చేసేవాడు. గుండెలపై తన పేరుతో రాసుకోవాలని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు తన గదికి వచ్చి శారీరక వాంఛలు తీర్చాలని కోరేవాడు. తాను చెప్పిన మాట వినకపోతే న్యూడ్ వీడియోలను సోషల్‌మీడియాలో పెట్టి పరువు తీస్తానని బ్లాక్‌మెయిల్ చేసేవాడు. ఆమెకు వచ్చే జీతాన్నంతా తనకే ఇవ్వాలని, లేకపోతే చంపేస్తానని బెదిరించేవాడు. ఇలా మూడు నెలల పాటు ఆ దుర్మార్గుడు ఆమెకు నరకం చూపించాడు.ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేక బాధితురాలు తనలో తానే కుమిలిపోయింది. రోజురోజుకీ అతడి పైశాచికం పెరిగిపోవడంతో తట్టుకోలేకపోయింది. అతడు పెట్టే చిత్రహింసలు భరించే కంటే చావే శరణ్యమనుకుని ఓ ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబసభ్యులు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. అయినప్పటికీ ఆమెను వదలని ఆ సైకో మళ్లీ వేధింపులు మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించి... మూడు నెలలుగా తాను అనభవిస్తున్న నరకాన్ని వివరించింది. ఈ ఘటనతో చలించిపోయిన పోలీస్‌ కమిషనర్ సజ్జనార్ వెంటనే చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో షీ టీమ్ డీసీపీ అనసూయ తన సిబ్బందితో కలిసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతడిపై రెండ్రోజుల్లో పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసే అవకాశాలున్నాయని డీసీపీ తెలిపారు.

Related Posts