ఇవాళే ఏపీ ఇంటర్ ఫలితాలు
విజయవాడ, జూన్ 11,
ఏపీలో శుక్రవారం ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ ఫలితాలను రేపు మధ్యాహ్నం 12. 30 తర్వాత విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించనున్నారు.కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆలస్యమైన జవాబు పత్రాల మూల్యాంకనం ఇంటర్ బోర్డు అధికారులు ఎట్టకేలకు పూర్తి చేశారు. దీంతో రేపు ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేయనుంది.మార్చి 4 నుంచి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ఎగ్జామ్స్ జరిగిన సంగతి విదితమే. కాగా, ఏపీలో పదో తరగతి పరీక్షలు జులై 10 నుంచి 15వ తేదీ వరకూ జరగనున్న విషయం తెలిసిందే.