అర్ధరాత్రి మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్
శ్రీకాకుళం జూన్ 12: మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిమ్మాడలో అచ్చెన్నను అదుపులోకి తీసుకున్నారు. ఈఎస్‌ఐ మందుల కొనుగోలులో అవకతవకలపై గతంలో ఏసీబీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పటికే కొంత మంది అధికారులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి నిమ్మాడకు వంద మందికిపైగా పోలీసులు చేరుకున్నారు. అచ్చెన్నాయుడిని శ్రీకాకుళం నుంచి విజయవాడకు ఏసీబీ అధికారులు తరలిస్తున్నారు.