YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

 ఈ ఎస్ ఐ స్కాం...అచ్చెన్నాయుడు అరెస్ట్

 ఈ ఎస్ ఐ స్కాం...అచ్చెన్నాయుడు అరెస్ట్

 ఈ ఎస్ ఐ స్కాం...అచ్చెన్నాయుడు అరెస్ట్
శ్రీకాకుళం, జూన్ 12,
టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడ్ని అరెస్ట్ అయ్యారు. ఈఎస్‌ఐ కుంభకోణంలో ఏసీబీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని ఆయన ఇంట్లో అరెస్ట్ చేసి.. సోదాలు కూడా నిర్వహించారు. అచ్చెన్నాయుడిని శ్రీకాకుళం నుంచి విజయవాడకు ఏసీబీ అధికారులు తరలిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈఎస్‌ఐలో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఏసీబీ కూడా రంగంలోకి దిగి కేసును దర్యాప్తు చేస్తోంది. ఇదే సమయంలో అచ్చెన్నాయుడ్ని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.ఏపీ ఈఎస్‌ఐలో భారీ కుంభకోణం బయటపడింది. ఈ స్కామ్‌ను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బయటపెట్టింది.. ఓ నివేదికను బయటపెట్టింది. ఈఎస్‌ఐ లేని కంపెనీలు నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని ఆర్డర్లు ఇచ్చినట్లు తేలిందట. ఈఎస్ఐ డైరెక్టర్లు రేట్ కాంట్రాక్ట్‌లో లేని కంపెనీలకు రూ.51కోట్లు చెల్లించినట్లు గుర్తించారు. మొత్తం రూ.988 కోట్లకు సంబంధించి రూ.150 కోట్లకుపైగా అవినీతి జరిగిందని గుర్తించారు.ఈఎస్‌ఐ రవికుమార్, రమేష్, విజయను బాధ్యులుగా గుర్తించారు. మందులు, పరికరాలను వాస్తవ ధరకంటే.. 135శాతం అధికంగా టెండర్లలో చూపించిన సంస్థలు నకిలీ కొటేషన్లతో లేని సంస్థలకు ఆర్డర్లు ఇచ్చినట్లు ఆధారాలు దొరికినట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణానికి సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఉందని రిపోర్ట్‌లో వెల్లడించినట్లు తెలుస్తోంది.ఈ వ్యవహారంపై అచ్చెన్నాయుడు స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో టెలీ హెల్త్ సర్వీసెస్‌కు నామినేషన్ పద్దతిలో కేటాయించాలని తాను లేఖ రాసానని చెప్పుకొచ్చారు. మిగతా రాష్ట్రాల ఏ విధానాలు అవలంభించాయో అలా వ్యవహరించాలని సూచించానని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణలో ఎలా అమలు చేశారో.. అలాగే అమలు చేశామని.. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని.. రికార్డుల్ని పరిశీలించి చర్యలు తీసుకోవచ్చన్నారు పోలీసుల అదుపులో డైరక్టర్ ఏపీలో ఈఎస్‌ఐ స్కాం సంచలనంరేపింది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్‌కాగా.. ఈ కేసులో ఈఎస్‌ఐ డైరెక్టర్ రమేష్‌కుమార్‌ను కూడా తిరుపతిలో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో ఏసీబీ మరికొందర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.. అలాగే మందులు, ఇతర పరికరాల కొనుగోళ్లలో భారీగా అవకతవకలు జరిగాయని గుర్తించినట్లు సమాచారం.అవసరం లేకపోయినా ఎలాంటి టెండర్లు లేకుండా శస్త్ర చికిత్స పరికాలు, మందులు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఈ స్కాంపై దర్యాప్తు చేశారు. 2014-2019 మధ్య ఈఎస్‌ఐలో భారీగా అక్రమాలు జరిగాయని గుర్తించారు.. ఏసీబీ ఇప్పటికే 8మంది అధికారుల వాంగ్మూలాలు రికార్డ్ చేసింది. టెండరింగ్ లేకుండా నామినేషన్ పద్దతిలో మందుల కొనుగోళ్లు జరిగాయని.. ఒకే లెటర్‌ మీద రెండు కంపెనీలకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.వాస్తవ ధర కన్నా రూ.150కోట్లు అదనంగా చెల్లించారని.. నకిలీ కొటేషన్లతో ఆర్డర్లు ఇచ్చినట్లు.. రూ.16వేల బయోమెట్రిక్ మెషిన్‌ను రూ.70వేలకు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఏసీబీ అరెస్ట్‌లు చేస్తోంది. అంతేకాదు కొనుగోళ్ల టెండరింగ్‌లో మాజీమంత్రి కుమారుడి పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్కామ్‌లో మొత్తం 40మంది పాత్ర ఉన్నట్లు సమాచారం. ఏసీబీ మరికొన్ని అరెస్ట్‌లకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Related Posts