YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

 అమ్మాయి పేరుతో ఫేక్ అకౌంట్...4 లక్షలు కొట్టేశాడు

 అమ్మాయి పేరుతో ఫేక్ అకౌంట్...4 లక్షలు కొట్టేశాడు

 అమ్మాయి పేరుతో ఫేక్ అకౌంట్...4 లక్షలు కొట్టేశాడు
హైద్రాబాద్, జూన్ 12,
ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు పరిచయమై.. న్యూడ్ ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేసి రూ.3.63 లక్షలు కొట్టేసింది యువతి కాదని హైదరాబాద్‌ పోలీసులు తేల్చారు. యువతి పేరుతో ఆమె సోదరుడే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించారు. హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో విధులు నిర్వహిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఓ యువతి పరిచయమైంది. ఇద్దరూ కొంతకాలం చాటింగ్‌ చేసుకుని న్యూడ్ ఫోటోలు షేర్ చేసుకున్నారు. ఆ తర్వాతి నుంచి టెక్కీకి వేధింపులు మొదలయ్యాయి. రూ.30 లక్షలు ఇవ్వకుంటే ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడింది. వారం రోజుల్లో రూ.3.63 లక్షలు తన అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకుంది. ఇంకా డబ్బు కావాలని వేధించడంతో బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులను ఆశ్రయించాడు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు టెక్నాలజీ సాయంతో దర్యాప్తు చేయగా షాకింగ్ విషయం తెలిసింది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌తో చాటింగ్‌ చేసింది అమ్మాయి కాదని, యువకుడని గుర్తించారు. మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన కె.పవన్‌కిరణ్‌ (20) నగరంలోని ఓ కాలేజీలో బీటెక్‌ సెకండియర్ చదువుతున్నాడు. ఆన్‌లైన్‌ జూదానికి, ఇతర విలాసాలకు అలవాటుపడిన అతడు సులభంగా డబ్బు సంపాదించడాలనే ఉద్దేశంతో సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేయడానికి ప్లాన్ వేశాడు. ఓ అమ్మాయి పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ క్రియేట్ చేసి అందమైన ఫోటోలు పోస్ట్ చేశాడు.దీని ద్వారా కాచిగూడకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. అమ్మాయి నుంచి రిక్వెస్ట్ వచ్చిందని సంబరపడిన అమాయకుడు వెంటనే యాక్సెప్ట్ చేశాడు. అప్పటి నుంచి ఇద్దరూ రోజుల తరబడి ఛాటింగ్ చేసుకుంటూ న్యూడ్‌ ఫోటోలు కూడా షేర్ చేసుకున్నారు. కొద్దిరోజుల తర్వాత వాటిని అడ్డం పెట్టుకుని రూ.30లక్షలు ఇవ్వకపోతే నీ న్యూడ్ ఫోటోలు సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. భయపడిపోయిన బాధితుడు రూ.3.63లక్షలు అతడి అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఇంకా డబ్బులు కావాలని వేధించడంతో పోలీసులను ఆశ్రయించగా అసలు నిజం బయటపడింది.

Related Posts