YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 భారత్ లో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ లేదు

 భారత్ లో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ లేదు

 భారత్ లో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ లేదు
న్యూఢిల్లీ, జూన్ 12,
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా నమోదువుతున్నా... సామూహిక వ్యాప్తిలోకి ప్రవేశించలేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) పునరుద్ఘాటించింది. దేశవ్యాప్తంగా 83 జిల్లాలలో ఐసీఎంఆర్ నిర్వహించిన సెరో-సర్వే మొదటి విడత ఫలితాలలో 0.73 నుంచి 1 శాతం కంటే తక్కువ మందికి కరోనా వైరస్ సోకినట్టు వెల్లడయ్యింది. కంటెయిన్‌మెంట్ జోన్లలో లేదా హాట్‌స్పాట్లలో పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ, దేశంలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లేదని ప్రభుత్వం నొక్కిచెప్పింది.ఐసీఎంఆర్ సెరో-సర్వే (రక్త నమూనాల్లో కోవిడ్-19 యాంటీబాడీస్ టెస్ట్) ఫలితాలను ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ్ వెల్లడించారు. దేశంలో కరోనా వైరస్ ‘సామూహిక వ్యాప్తి’ అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.. దీనికి డబ్ల్యూహెచ్ఓ కూడా ఎలాంటి నిర్వచనం ఇవ్వలేదని నా అభిప్రాయం.. మేము నిర్వహించిన సర్వే కూడా చెప్పినట్టు, అతిపెద్ద జనాభా కలిగిన భారత్‌లో కరోనా ప్రాబల్యం చాలా తక్కువగా ఉంది. పట్టణ, కంటెయిన్‌మెంట్ ప్రాంతాల్లో ఇది కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. కానీ ఖచ్చితంగా సామూహిక సంక్రమణ మాత్రం లేదు’అని బలరామ్ భార్గవ్ అన్నారు.రెండో దశ సర్వేలో ఢిల్లీ, ముంబయి, అహ్మదాబాద్ సహా తదితర హాట్‌స్పాట్స్‌లో వైరస్ సంక్రమణపై అంచనా కొనసాగుతోంది.. గురువారం వెల్లడించిన తొలి దశ సర్వే నివేదికలో ఏప్రిల్ 30 వరకు పరిస్థితి ఆధారంగా అంచాన వేశామన్నారు. మే నెలలో ఐసీఎంఆర్ నిర్వహించిన సర్వేలో ఏప్రిల్ 25 వరకు నమూనాలను పరిశీలనకు తీసుకున్నట్టు తెలిపారు.ఇది ఏప్రిల్ చివరినాటి పరిస్థితిని ప్రతిబింబిస్తుందనే అంచనా.. సామూహిక సంక్రమణ దశకు ప్రవేశించడానికి రెండు వారాల సమయం పడుతుందని అన్నారు. అయితే, ఇదే సమయంలో ఉదాసీనత పనికిరాదని, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీమ్‌మెంట్ విధానం కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. స్థానిక వ్యాప్తిని అరికట్టడానికి ఉద్దేశించిన ఈ విధానం ఇప్పటికీ పెద్ద సంఖ్యలో జరగడంలేదని వ్యాఖ్యానించాయి.సెరో-సర్వేలో భాగంగా ఇప్పటి వరకు 65 జిల్లాల నుంచి డేటా సేకరించి నివేదిక రూపొందించారు. ఇప్పటి వరకూ నిర్వహించిన అతిపెద్ద సెరో సర్వే ఇదే కావచ్చునని ఐసీఎంఆర్ తెలిపింది. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణాల్లో వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉందని సర్వేలో తేలింది. పట్టణ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి ముప్పు 1.09 రెట్లు అధికంగా ఉండగా, పట్టణాల్లోని మురికివాడల్లో గ్రామీణ ప్రాంతాల కంటే 1.89 రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. సర్వే చేసిన వారిలో మరణాల రేటు 0.08% వద్ద చాలా తక్కువగా ఉందని కూడా ఇది తెలిపింది.

Related Posts