YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

నకిలీ కోటేషన్లతో కొనుగోళ్లు

నకిలీ కోటేషన్లతో కొనుగోళ్లు

నకిలీ కోటేషన్లతో కొనుగోళ్లు
విశాఖపట్నం జూన్ 12
మాజీ మంత్రి,టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి అరెస్టు వ్యవహారంపై విశాఖ ఏసీబీ అధికారులు స్పందించారు.తెల్లవారు జామున శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని ఆయన స్వగృహంలో అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈఎస్ఐలో ప్రధానంగా మందులు, ల్యాబ్ కిట్స్, సర్జికల్ ఐటమ్స్, ఫర్నిచర్ కొనుగోళ్లకు సంబంధించి అక్రమాలు జరిగాయని అనుమానిస్తున్న ఏసీబీ అధికారులు మాజీ డైరెక్టర్ సీకే రమేశ్ కుమార్ బంధువుల పేర్లమీద నకిలీ కొటేషన్లతో మార్కెట్ ధర కంటే 50 నుంచి 130 శాతం అధిక ధరలకు విక్రయాలు జరిగాయని నిర్దారించిన్నట్లు సమాచారం. అయితే ఈ-టెండర్ల విధానంలో కాకుండా నామినేషన్  పద్ధతిలో కొనుగోళ్లు చేశారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం 988 కోట్లు కేటాయిస్తే .. అందులో150 కోట్ల  వరకు అవినీతి జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ డైరెక్టర్  సీకే రమేశ్ కుమార్, డాక్టర్ విజయ్కుమార్, అప్పటి కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు మరికొందరి పాత్ర ఇందులో ఉందని ఏసీబీ అధికారులు ఈ ముగ్గుర్ని విచారించేందుకు సిద్ధమైయ్యారు.ఈ క్రమంలో నిమ్మాడలో అచ్చెన్నాయుడిని అరెస్టు చేసినట్లు విశాఖలో ఏసీబీ అధికారులు ప్రకటించారు. రమేశ్కుమార్ను తిరుపతిలో, విజయకుమార్ను రాజమహేంద్ర వరంలో అరెస్టు చేశారు. ఈ ముగ్గురినీ విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని అని ఏసీబీ డైరెక్టర్ రవి కుమార్ తెలిపారు.
 

Related Posts