YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

జిల్లాల్లో కనిపించని హరిత సైన్యం

జిల్లాల్లో కనిపించని హరిత సైన్యం

జిల్లాల్లో కనిపించని హరిత సైన్యం
నిజామాబాద్, జూన్ 12
ఉమ్మడి జిల్లాలో అటవీశాఖ, ఉపాధిహామీ పథకం ఆధ్వర్యంలో 329 నర్సరీల్లో   టేకు, ఈత, పండ్లు, పూల మొక్కలతో పాటు గుల్‌మోరా, నల్లమద్ది, రేన్‌ట్రీ, సిల్వర్‌ఓక్‌, బహూన్యా, పిడ్‌తల్‌, కానుగ, మోదుగు, నమిలినార, మర్రి, వేప, చింత, తంగేడు, అల్లనేరేడు, జామ, సీతాఫలం, నిమ్మ, దానిమ్మ మొక్కలను పెంచుతున్నారు.హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కల సంరక్షణకు ప్రతి గ్రామంలో డ్వాక్రామహిళలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో హరితసైన్యం ఏర్పాటు చేశారు. వీరు క్రమం తప్పకుండా మొక్కల ఎదుగుదలకు చర్యలు చేపట్టాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కుబడి కార్యక్రమం చేపట్టకుండా పక్కగా చర్యలు తీసుకోవాలని వనప్రేమికులు కోరుతున్నారు. లక్ష్యం మేర మొక్కలు నాటి చేతులు దులుపుకుంటున్నారే విమర్శలు వస్తున్నాయి. నాటిన మొక్కలకు సంరక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొంటున్నారు. గత మూడు విడతలుగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో 60శాతం మొక్కలు పెరగడం లేదని అంటున్నారు. ప్రతి ఏటా హరితహారం కార్యక్రమానికి కోట్లు ఖర్చుచేస్తున్నా అనుకున్న ఆశయం నేరవేరడం లేదు.చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తగా మొక్కలు నాటాలి. ప్రతి శుక్రవారం జలదినోత్సవం నిర్వహించాల్సిన ఉన్నా అధికారులు అక్కడక్కడ కార్యక్రమం చేపడుతున్నారు.అటవీశాఖ, ఉపాధిహామీ పథకం ఆధ్వర్యంలో మొక్కలు నాటే ప్రాంతాల గుర్తింపును అధికారులు చేపడుతున్నారు. ప్రధానంగా రోడ్లవెంబడి, అటవీప్రాంతాలు, ఖాళీ ప్రదేశాలు, గ్రామపంచాయతీలు, ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, అంగన్‌వాడీ, ప్రభుత్వ స్థలాలు,  కార్యాలయాలు, శ్మశాన వాటికలు, డంపింగ్‌యార్డులు, చెరువు గట్లు, రైతుల పొలాల గట్ల వెంబడి పెంచనున్నారు. గ్రామాలు, ప్రాంతాల వారీగా మొక్కల ప్రణాళికలను తయారు చేస్తున్నారు.హరితహారం కార్యక్రమంలో అధికారుల అలసత్వం ప్రదర్శిస్తున్నారని పలువరు ఆరోపిస్తున్నారు. పథకం ప్రారంభానికి హడావుడి చేస్తూ మమ అనిపిస్తున్నారు. మొక్కలు నాటిన అనంతరం క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. నీటి వసతికి ఏర్పాట్లు చేయడం లేదు. దీంతో మొక్కలు నాటిన కొన్ని రోజులకే చనిపోతున్నాయి.
 

Related Posts